Telugu Gateway
Cinema

కుషీకుషీగా ఎన్టీఆర్

కుషీకుషీగా ఎన్టీఆర్
X

అరవింద సమేత వీరరాఘవ సినిమా సూపర్ హిట్ అంటూ టాక్ రావటంతో హీరో ఎన్టీఆర్..దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుషీకుషీగా ఉన్నారు. ఈ సినిమా క్రెడిట్ అంతా హీరో ఎన్టీఆర్ దే అని త్రివిక్రమ్ ప్రకటించగా...ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమే కారణం అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ‘ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడానికి త్రివిక్రమ్‌ కారణం. ఆయనే లేకుండా ఇదంతా జరిగేది కాదు. ఆయన డెడికేషన్‌, ఫోకస్‌ మమ్మల్ని ముందుకు నడిపించింది. థ్యాంక్యూ సర్‌. ఈ చిత్రాన్ని భుజాలపై మోసిన యూనిట్‌ సభ్యులందరికి ధన్యవాదాలు.

నాకు అతిపెద్ద బలమైన అభిమానులందరికి , మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు’ అంటూ ఎన్టీఆర్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఎన్టీఆర్ సినిమాల్లో ఉండే పాటలు..డ్యాన్స్ లు పెద్దగా లేకుండా ఉంటే ఎలా? అని తర్జనభర్జనలు పడ్డామని తెలిపారు. అయినా సరే ఎన్టీఆర్ మీరు చెప్పిన కథ ప్రకారం ముందుకు వెళ్లండి చాలు..పలితం సంగతి తర్వాత చూద్దాం అంటూ ధైర్యంగా ముందు ఉండి నడిపించారని పేర్కొన్నారు. మొత్తానికి యూనిట్ అంతా సినిమా టాక్ తో హ్యాపీకిగా ఉంది.

Next Story
Share it