Telugu Gateway
Top Stories

పైలట్లకు జీతాలు ఇవ్వలేని స్థితికి జెట్ ఎయిర్ వేస్

పైలట్లకు జీతాలు ఇవ్వలేని స్థితికి జెట్ ఎయిర్ వేస్
X

దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ లో ఒకటైన జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేదా?. ఇప్పట్లో పడే అవకాశం కన్పించటం లేదా?. చూస్తుంటే అలాగే ఉంది. ప్రస్తుతం ఈ ఎయిర్ లైన్స్ అత్యంత కీలకమైన పైలట్లు..ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. గతంలోనూ ఓసారి జీతాలకు సంబంధించిన వివాదం తలెత్తింది. సెప్టెంబర్ నెల జీతాలను ముందు హామీ ఇచ్చినట్లుగా ఈ నెల 11న చెల్లించలేమని..అయితే సాధ్యమైనంత తొందరగా చెల్లించే ఏర్పాట్లు చేస్తామని చెబుతోంది. అప్పటివరకూ ఉద్యోగులు తమకు సహకరించాలని కోరుతోంది.

గత కొన్ని నెలలుగా సిబ్బందికి జీతాలను వాయిదాల ప్రకారం చెల్లిస్తూ వస్తోంది. విమానాల్లో ఇంధనంగా ఉపయోగించే ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర గణనీయంగా పెరగటం, నిర్వాహణ వ్యయాలు పెరుగుదల కారణంగా జెట్ ఎయిర్ వేస్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని చెబుతున్నారు. మరి ఈ అగ్రశ్రేణి ఎయిర్ లైన్స్ కష్టాల నుంచి ఎలా గట్టెక్కుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it