Telugu Gateway
Telangana

తెలుగు మీడియాలో ‘మీ టూ’ మొదలైతే...!

తెలుగు మీడియాలో ‘మీ టూ’ మొదలైతే...!
X

లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి మీడియా కూడా పాకింది. ఈ వ్యవహారంలో టకటకా పెద్ద పెద్ద వికెట్లు కూడా పడుతున్నాయి. మరి కొంత మంది విచారణల పేరుతో ‘స్టేటస్ కో’ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు జాతీయ మీడియాను ‘మీటూ’ ఉద్యమం షేక్ చేస్తోంది. కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరంతా ముఖ్య స్థానాల్లో ఉన్న ‘బాస్ ’లే కావటం విశేషం. తెలుగు మీడియాలో ‘మీ టూ’ ఉద్యమం మొదలైతే..ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటం కూడా కష్టమే. ఏకంగా కొన్ని మీడియా సంస్థల అధినేతలపైనే ఈ ఆరోపణలు మీడియా సర్కిల్స్ లో గుప్పుమంటున్నాయి. కొన్ని ఛానల్స్ అధినేతలు కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. తమ దగ్గర పనిచేసే ఉద్యోగులనే వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే విషయం బయటకు చెపితే ఉద్యోగం పోతుందనే..రకరకాల కారణాలతో చాలా మంది మౌనాన్నే ఆశ్రయిస్తున్నాయి.

టాలీవుడ్ లో అవకాశాల కోసం వచ్చేవారిలో కొంత మంది ‘కాస్టింగ్ కౌచ్’ ను ఎదుర్కొన్న తరహాలోనే ‘మీడియా’లో ఉద్యోగాలకు వచ్చే వారికి ఇలాంటి వేధింపులు ఎదురవుతున్నాయన్నది బహిరంగ రహస్యం. కానీ ఇప్పటివరకూ తెలుగులో ఎవరూ సాహసం చేసి ఇలాంటి విషయాలను బయటపెట్డలేదు. శ్రీరెడ్డి వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు కొంత మేర సోషల్ మీడియాలో ఈ వ్యవహారం చర్చ నడిచింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ‘మీటూ’ ఉద్యమం మొదలు కావటంతో అందరి ఫోకస్ తెలుగు మీడియావైపు ఆసక్తిగా చూస్తోంది. కొన్ని చోట్ల ఏకంగా బాస్ లే వేధిస్తుంటే..మరికొన్ని చోట్ల ‘మిడిల్ మేనేజ్ మెంట్’ స్థాయి వారు కూడా ఇలా మహిళలను వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Next Story
Share it