Telugu Gateway
Telangana

శంషాబాద్ విమానాశ్రయం..కొత్త టెర్మినల్ సేవలు అక్టోబర్ 23 నుంచే

శంషాబాద్ విమానాశ్రయం..కొత్త టెర్మినల్ సేవలు అక్టోబర్ 23 నుంచే
X

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళుతున్నారా?. మీరు ఎప్పటిలాగే పాత టెర్మినల్ కు వెళితే కష్టాలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్టోబర్ 23 నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కొత్త టెర్మినల్ సిద్దం చేశారు. దీంతో అందరూ ఆ టెర్మినల్ కు వెళ్లాల్సిందే. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించే వారి కోసం జీఎంఆర్ సంస్థ తాత్కాలిక భవనం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉన్న టెర్మినల్ సామర్ధ్యానికి మించి ప్రయాణికులను హ్యాండిల్ చేస్తోంది. దీంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ఆ సమస్య కొంత వరకూ తీరనుంది. అక్టోబర్ 23 ఉదయం పది గంటల నుంచి కొత్త టెర్మినల్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయని జీఎంర్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎయిర్ ఇండియాకు సంబంధించి ఏఐ 127, ఏఐ 952,ఏఐ 978, ఏఐ988, ఏఐ966, ఏఐ051 సర్వీసుల్లో బుక్ చేసుకున్న అంతర్జాతీయ, దేశీయ ప్రయాణికులు తాత్కాలిక అంతర్జాతీయ టెర్మినల్ కే చేరుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఈ టెర్మినల్ కు చేరుకోవాలంటే కార్గో రోటరీ మార్గం ద్వారా హజ్ టెర్మినల్ వైపు వెళ్లి చేరుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు కొత్త టెర్మినల్ సూచీలు కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రస్తుత టెర్మినల్ నుంచి కొత్త టెర్మినల్ కు ఉచిత షటిల్ సర్వీసులు కూడా ఏర్పాటు చేశారు.

Next Story
Share it