Telugu Gateway
Latest News

పది కోట్లు దాటిన దేశీయ విమాన ప్రయాణికులు

పది కోట్లు దాటిన దేశీయ విమాన ప్రయాణికులు
X

ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య పది కోట్లను దాటేసింది. 2018 జనవరి-సెప్టెంబర్ కాలంలో వివిధ మార్గాల్లో ప్రయాణించిన వారి సంఖ్య 10.27 కోట్లుగా డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విమాన ప్రయాణికుల సంఖ్యలో 20.94 శాతం పెరుగుదల నమోదు అయింది. 2017 జనవరి -సెప్టెంబర్ కాలంలో ప్రయాణికుల సంఖ్య 8.49 కోట్లుగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 95.83 లక్షల మంది ఉండగా..2018 సెప్టెంబర్ లో ఈ సంఖ్య 1.13 కోట్లకు పెరిగింది. గత కొంత కాలంగా ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న దేశీయ చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ సెప్టెంబర్ నెలలోనూ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

స్పైస్ జెట్ కు ఇతర ఎయిర్ లైన్స్ కు మధ్య గ్యాప్ మాత్రం చాలా ఎక్కువగా ఉండటం విశేషం. 2018 సెప్టెంబర్ లో స్పైస్ జెట్ 93.2 శాతం ఫ్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ సాధించింది. అదే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ 81.1 శాతంగా ఉంది. ఇండిగో ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ 82.7 శాతం ఉంది. ఎయిర్ డెక్కన్ వచ్చిన తర్వాత సర్వీసుల రద్దు విషయంలో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ట్రూజెట్ సర్వీసుల రద్దు శాతం 2.29శాతం ఉంది.అ దే ఎయిర్ డెక్కన్ సర్వీసుల రద్దు 52.71 శాతం ఉంది.

Next Story
Share it