Telugu Gateway
Top Stories

ఐసిఐసిఐ బ్యాంకులో కీల‌క ప‌రిణామం

ఐసిఐసిఐ బ్యాంకులో కీల‌క ప‌రిణామం
X

దేశంలోని ప్ర‌ముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. బ్యాంక్ ఎండీ, సీఈవో ప‌ద‌వికి చందా కొచ్చార్ రాజీనామా చేశారు. ఆమెపై ఇటీవ‌ల కాలంలో తీవ్ర‌మైన అభియోగాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా వీడియో కాన్ సంస్థ‌కు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా రుణం మంజూరు చేసి..క్విడ్ ప్రో కింద త‌న భ‌ర్త కంపెనీకి ప్ర‌యోజ‌నం చేకూర్చ‌ర‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామాల‌తో ఆమె త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. వివాదం త‌లెత్తిన కొద్ది రోజుల‌కే ఆమె దీర్ఘ‌కాలిక సెల‌వుపై వెళ్ళారు. ఇప్పుడు త‌న ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. చందా కొచ్చార్ రాజీనామాను ఐసిఐసిఐ బోర్డు ఆమోదించింది. అంతే కాదు..నూత‌న ఎండీ, సీఈవోగా సందీప్ ను నియ‌మించింది.

ప్ర‌స్తుతం ఆయ‌న తాత్కాలిక సీఈవో బాధ్య‌తలు నిర్వ‌హిస్తున్నారు. చందాకొచ్చార్ రాజీనామాను ఆ బ్యాంక్ మ‌దుపుదారులు స్వాగ‌తించిన‌ట్లు క‌న్పిస్తోంది. స‌హ‌జంగా కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న వారు వైదొలిగితే ఆ కంపెనీ షేర్లు భారీగా ప‌త‌నం అవుతాయి. అందుకు భిన్నంగా ఈ వార్త వెలువ‌డిన స‌మ‌యంలో షేరు ధ‌ర పెర‌గ‌టం విశేషం. వీడియోకాన్ సంస్థ‌కు చందా కొచ్చార్ మంజూరు చేసిన 3250 కోట్ల రూపాయ‌ల రుణం పెద్ద వివాదంగా మారింది. ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌స్తుతం ప‌లు ద‌ర్యాప్తు సంస్థ‌లు విచార‌ణ సాగిస్తున్నాయి. చందా కొచ్చార్ రాజీనామాను బ్యాంకు నియంత్ర‌ణా సంస్థ‌ల‌కు తెలియ‌జేసింది.

Next Story
Share it