Telugu Gateway
Cinema

‘అమెరికా’లో దుమ్మురేపుతున్న అరవింద కలెక్షన్లు

‘అమెరికా’లో దుమ్మురేపుతున్న అరవింద కలెక్షన్లు
X

ఎన్టీఆర్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించారు. అమెరికాలో అరవింద సమేత సినిమా కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. త్రివిక్రమ్ మాటల తూటాలు..ఎన్టీఆర్ నోటి నుంచి ఎలా పేలుతాయో అరవింద సమేత చూపించింది. మొదటి నుంచి వీరిద్దరి కాంబినేషన్ అంటే అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో వీరిద్దరూ ఒక్క సినిమా కూడా చేయలేదు. తొలి సినిమా కాంబినేషన్ పై టెన్షన్ పడ్డారు. కానీ అరవింద సమేతలో చాలా డైలాగుల డెప్త్..ఎన్టీఆర్ డైలాగ్ డెలివరితో వాటి రేంజ్ మరింత పెరిగిపోయింది.

ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ఈ చిత్రం అమెరికాలో ప్రీమియర్‌ షో వసూళ్లను సోషల్ మీడియాలో షేర్‌చేశారు. వారం మధ్యలో రిలీజ్‌ చేసినా.. బాక్సాపీస్‌ను షేక్‌ చేశాడు అంటూ.. 218 లొకేషన్లలో వేసిన ప్రీమియర్స్‌ తో దాదాపు 7.91లక్షల డాలర్లు ( 5.85కోట్లు) వసూలు చేసినట్టు పేర్కొన్నారు. ఇక మిలియన్‌ డాలర్లకు దగ్గర్లో ఉండగా.. ఈజీగా రెండు మిలియన్ల డాలర్లను క్రాస్‌ చేసేసి మూడు మిలియన్‌ డాలర్లను చేరుకుంటుందని అభిమానులు లెక్కలేసుకుంటున్నారు.

Next Story
Share it