Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ఎంతకైనా దిగజారతారా?

చంద్రబాబు ఎంతకైనా దిగజారతారా?
X

‘అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యలో వైసీపీ పాత్ర ఉందని బాధిత కుటుంబాల్లో అనుమానం ఉంది.’ ఇదీ శుక్రవారం నాడు విలేకరుల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య. అంటే ఆయన బాధిత కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు నమ్మి బహిరంగంగా ఈ ప్రకటన చేశారా?. లేక రాజకీయంగా వాడుకోవటం కోసం చేశారా?. ముఖ్యమంత్రి వాటిని నమ్మి చేస్తే ఆ దిశగా వైసీపీపై కేసులు పెట్టాలి.? లేదంటే కేవలం రాజకీయంగా బురదజల్లటం కోసమే చేసినట్లు లెక్క?. నిజంగా చంద్రబాబు చెప్పినట్లు...బాధిత కుటుంబాల అనుమానం ఉన్నట్లే నిజంగా కిడారి సర్వేశ్వరరావు హత్యలో వైసీపీ హస్తమే ఉందనుకుందాం కాసేపు చర్చ కోసం ?. అది ప్రభుత్వ వైపల్యం కాదా?. ఇంటిలిజెన్స్ యంత్రాంగం నీరుగారిపోయినట్లు కాదా?. ఓ ప్రతిపక్ష పార్టీ...ఏకంగా మావోయిస్టులతో కుమ్మక్కు అయి ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేను హత్య చేయించింది అంటే అసలు ఏపీలో ప్రభుత్వం ఉన్నట్లేనా?. యంత్రాంగం పనిచేస్తున్నట్లా?.

దేశంలోనే తనను మించిన సీనియర్ ఎవరూ లేరని చెప్పుకునే చంద్రబాబు స్థాయి మాటలేనా? ఇవి అని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో బాక్సైట్ తవ్వకాలకు రంగం సిద్ధం చేసి..జీవోలు కూడా జారీ చేసి..గిరిజన ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడ కూడా ‘యూటర్న్ ’ తీసుకున్నారు. అంటే గిరిజనుల నుంచి ఆ స్థాయి వ్యతిరేకత వ్యక్తం కాకపోయి ఉంటే ఇప్పటికే బాక్సైట్ తవ్వకాలు మొదలై ఉండేవి?. కానీ పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేకపోవటం చంద్రబాబు అసలు బాక్సైట్ తవ్వకాలు జరిపేది లేదంటూ ఇప్పుడు చెబుతున్నారు. ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఎవరి ప్రోద్భలంతో చంపినా..కాపాడుకోలేకపోవటం అది ప్రభుత్వ..చంద్రబాబు వైఫల్యంగానే చరిత్రలో నిలిచిపోతుంది.

Next Story
Share it