Telugu Gateway
Telangana

అర్థాంతరంగా ముగిసిన తెలంగాణ తొలి అసెంబ్లీ కాలపరిమితి

అర్థాంతరంగా ముగిసిన తెలంగాణ తొలి అసెంబ్లీ కాలపరిమితి
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొలువుదీరిన తొలి అసెంబ్లీ ఐదేళ్ళ పదవీ కాలం పూర్తి కాక ముందే అర్థాంతరంగా ముగిసింది. అసెంబ్లీని రద్దు చేసి..ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం కెసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 2018 సెప్టెంబర్ 6నాటికి సీఎంగా కెసీఆర్ బాధ్యతలు చేపట్టి 4 సంవత్సరాల 3 నెలల 4 రోజులు అయింది. వాస్తవానికి ఇంకా అసెంబ్లీకి ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. అయినా సరే పూర్తి మెజారిటీ కలిగిన కెసీఆర్ గురువారం మధ్యాహ్నాం ఒకటిన్నర సమయంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి..కేబినెట్ రద్దుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఈ మంత్రివర్గ సమావేశం అతి తక్కువ సమయం మాత్రమే సాగింది.

మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే సీఎం కెసీఆర్ అసెంబ్లీ రద్దు తీర్మానంతో రాజ్ భవన్ కు చేరి..గవర్నర్ కు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిజయేశారు. అదే సమయంలో అసెంబ్లీ రద్దు చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రతిని అందజేశారు. తీర్మానం అందుకున్న తర్వాత కెసీఆర్ ను ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ నరసింహన్ కోరారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే బంతి ఎన్నికల సంఘం కోర్టులోకి వెళ్ళనుంది. సీఎం కెసీఆర్ మాత్రం ఎలాగైనా డిసెంబర్ లోపు అంటే 2018లోగానే ఎన్నికలు పూర్తి చేయించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన పెద్ద ఎత్తున కసరత్తే చేశారు. మరి ఇప్పుడు ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న అంశంపై వేచిచూడాల్సిందే.

Next Story
Share it