Telugu Gateway
Andhra Pradesh

స్వయం ప్రకటిత ‘సీనియర్’ బాబుకు ఆ విషయం తెలియదా?

స్వయం ప్రకటిత ‘సీనియర్’ బాబుకు ఆ విషయం తెలియదా?
X

ప్రభుత్వాలు ‘అరెస్టు వారంట్లు’ జారీ చేస్తాయా? స్వయం ప్రకటిత దేశ సీనియర్ రాజకీయవేత్త చంద్రబాబుకు ఆ విషయం కూడా తెలియదా?. చంద్రబాబుకు అసలు సానుభూతి అక్కర్లేదా? ‘నేను మా మనవడితో అడుకోవటానికి సమయం కూడా చిక్కటం లేదు. నిత్యం ప్రజల కోసమే కష్టపడుతున్నా?. ఈ వయస్సులో ఎవరైనా మనవడితో ఆడుకోవాలని కోరుకుంటారు.’ ఈ మాటలు అన్నీ దేని కోసం మాట్లాడుతున్నట్లు?. సానుభూతి కోసం కాదా?. ఓ పక్క అడ్డగోలుగా అవినీతి చేస్తూ ‘నేను నిప్పు’ అని చెప్పుకోవటం ఒక్క చంద్రబాబుకే చెల్లు. అలాగే ఓ వైపు నిత్యం సానుభూతి కోసం ప్రయత్నిస్తూ నేను సానుభూతి పొందాలని చూస్తున్నానా?. నాకెందుకు సానుభూతి అంటూ అమాయకంగా అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించటం ఆయనకే చెల్లింది. మహారాష్ట్రలో మీ ప్రభుత్వం లేదా?. కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వం కాదా?’ అంటూ చాలా అమాయకంగా ప్రశ్నించారు చంద్రబాబు సోమవారం నాడు. అంటే చంద్రబాబు లాంటి సీనియర్ నేత, సీనియర్ ముఖ్యమంత్రికి నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు ప్రభుత్వాలు కాదు..కోర్టులు జారీ చేస్తాయని తెలియదా?.

అసలు చంద్రబాబు ప్రజలకు ఏమి చెప్పదలచుకున్నారు?. ప్రభుత్వాలు చెపితే కోర్టులు వారి మాటలకు తలొగ్గి నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ చేస్తాయా?. ఇదేనా చంద్రబాబు అనుభవం. అసలు చంద్రబాబుకు వచ్చిన అరెస్టు వారంట్ నోటీసుకు అంత సీన్ ఉందా?. ఇప్పటికే పదుల సంఖ్యలో నోటీసులు జారీ చేసినా స్పందించకపోవటంతోనే కదా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. ఓ పథకం ప్రకారం ఎంపిక చేసిన మీడియా ద్వారా పదే పదే ఇదే అంశంపై ప్రచారం చేసుకోవటంతో పాటు..ఎప్పుడో 2010లో బాబ్లీ కోసం చేసిన ధర్నా విజువల్స్ ను కూడా వెలికితీసే టీవీల్లో ప్రసారం చేయించుకోవటం ద్వారా చంద్రబాబు ‘రాజకీయ ప్రయోజనాలు’...సానుభూతి ఆశించటం లేదా?. చంద్రబాబు అంత నిజాయతీపరుడైన రాజకీయవేత్త అని ఎవరైనా నమ్ముతారా?. నమ్మాలనేది ఆయన కోరిక. కానీ ఏకంగా కోర్టులు జారీ చేసిన నోటీసులపై రాజకీయ రచ్చ చేయటం ద్వారా చంద్రబాబు ప్రజలకు ఏమి సందేశం ఇవ్వదలచుకున్నారు?.

Next Story
Share it