Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

అసెంబ్లీ రద్దుకు ముందే ఎమ్మెల్యేకు రేవంత్ రాజీనామా

0

ముందస్తు ఎన్నికల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం మంత్రివర్గ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే సీఎం కెసీఆర్ అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకోవటానికి ముందే రేవంత్ రెడ్డి స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే స్పీకర్ దీన్ని విడిగా ఆమోదించే అవకాశాలు చాలా తక్కువ. అసెంబ్లీ రద్దు అయినప్పుడు అందరి సభ్యత్వాలు రద్దు అవుతాయి. రేవంత్ రెడ్డి రాజీనామా కూడా పూర్తి రాజకీయ కోణంలోనే చేసినట్లు కన్పిస్తోంది.

- Advertisement -

ఓ వైపు అసెంబ్లీ రద్దు మరికొన్ని గంటల్లో జరగనుండగా..రేవంత్ రాజీనామా లేఖ ఇవ్వటం రాజకీయంగా విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. టీడీపీ టిక్కెట్ పై గెలిచిన రేవంత్ తర్వాత కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇచ్చినట్లు ప్రకటించారు. అప్పటి నుంచి నుంచి అసెంబ్లీ సమావేశాలకు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు వ్యూహాత్మంగా రాజీనామా చేసి రాజకీయ వర్గాల్లో చర్చకు కేంద్ర బిందువుగా మారారు. రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో అందజేశారు.

 

Leave A Reply

Your email address will not be published.