Telugu Gateway
Cinema

‘డిస్కోరాజా’గా రవితేజ!

‘డిస్కోరాజా’గా రవితేజ!
X

రవితేజ కొత్త సినిమాకు ఓకే చెప్పేశారు. ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్ హీరో నటిస్తున్న అమర్ అక్భర్ అంటోని సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అక్టోబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో కొత్త సినిమాకు అంగీరించారు రవితేజ. ఈ సినిమాకు ‘డిస్కో రాజా’ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు టాక్. కొత్త సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం’ చిత్రాల ఫేమ్‌ వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కనుంది. రామ్‌ తాళ్లూరి నిర్మాత. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు పోనుంది. కొత్త సినిమాలో రవితేజ తండ్రీ కొడుకుల పాత్రల్లో నటించనున్నారని టాలీవుడ్ టాక్.

Next Story
Share it