Telugu Gateway
Cinema

‘రష్మిక’ బ్రేకప్ నిజమే

‘రష్మిక’ బ్రేకప్ నిజమే
X

రష్మిక మందన. టాలీవుడ్ లో ఈ మధ్య బాగా విన్పిస్తున్న పేరు. ఈ అమ్మడు చేసిన తొలి తెలుగు సినిమా ‘ఛలో’ హిట్. తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’ కూడా సూపర్ హిట్. అంతే కాదు..రష్మిక నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. మరో సినిమా దేవదాస్ ఈ నెలలోనే విడుదల కానుంది. అంతే కాదు..టాలీవుడ్ లో రష్మిక సీజన్ నడుస్తుందనే చెప్పొచ్చు. అయితే ఈ హీరోయిన్ కు సంబంధించిన వ్యక్తిగత వార్తలు కొద్ది రోజుల క్రితం కలకలం రేపాయి. రష్మిక మందన, రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్ మెంట్ రద్దు అయిందనే వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలను రష్మిక అప్పట్లో ఖండించింది. ఏడాది తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకున్నాం కానీ..బ్రేకప్ ఏమీలేదని ప్రకటించింది. అయితే రక్షిత్ శెట్టి, రష్మిక మందనల మధ్య బ్రేకప్ జరిగిందనే విషయాన్ని ఆమె తల్లి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ధృవీకరించారు. దీంతో గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారం నిజమే అని తేలింది. రష్మిక ఇఫ్పుడు పలు భాషల్లో వరస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఆమె కూడా సినిమాలపైనే ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

Next Story
Share it