Telugu Gateway
Politics

జగన్ రాజకీయ వ్యూహకర్త రాజకీయాల్లోకి జంప్

జగన్ రాజకీయ వ్యూహకర్త రాజకీయాల్లోకి జంప్
X

వాళ్ళకు వీళ్లకు రాజకీయ వ్యూహాలు చెప్పటం ఎందుకు?. మనమే రాజకీయాల్లోకి దూకితే పోలా అనుకున్నారు ఆయన. అనుకున్నదే తడవుగా బీహార్ కు చెందిన నితీష్ కుమార్ పార్టీ జెడీ (యూ)లో చేరిపోయారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ కు చెందిన సంస్థ ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందిస్తోంది. గతంలో ఆయన ఇదే తరహాలో అప్పటి ప్రధాని మోడీతోపాటు మరికొందరికి కూడా ఇలాంటి సేవలే అందించారు. అయితే ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ ఎంట్రీతో ఆయనకు చెందిన ఐ ప్యాక్ సంస్థ భవిష్యత్ లో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుందనేది కీలకంగా మారనుంది. ఒకప్పుడు ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలకు ఎంతో దగ్గర ఉన్న ఆయన తర్వాత కొంత దూరం అయ్యారు.

ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్న నితీష్ కుమార్ పార్టీలో చేరిన ప్రశాంత్ కిషోర్ పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారిపోతారా?. రాజకీయాలతో పాటు గతంలో మాదిరి రాజకీయ వ్యూహాల అమలులో కూడా కీలక పాత్ర పోషిస్తారా? అన్నది వేచిచూడాల్సిందే. ప్రశాంత్ కిషోర్ చేరిక సమయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ఆయనే భవిష్యత్’ అంటూ నితీష్ చేసిన వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటా అన్న చర్చ జోరుగా సాగుతోంది. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది.

Next Story
Share it