Telugu Gateway
Cinema

తెలుగు తెరకు ‘కొత్త సావిత్రి’

తెలుగు తెరకు ‘కొత్త సావిత్రి’
X

అదృష్టం ఉండాలే కానీ..ఆ సారి తప్పిపోయినా మళ్లీ అవకాశం అందుతుంది. నిత్యామీనన్ విషయంలో అచ్చం అదే జరిగింది. తొలుత సావిత్రి సినిమాకు నిత్యామీనన్ నే అనుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ ఛాన్స్ కీర్తి సురేష్ దక్కింది. అచ్చం సావిత్రిలా నటించి ‘కీర్తి సురేష్’ అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. అలా చేసింది ఆ పాత్రలో ఆమె. గతంలో మిస్ అయిన సావిత్రి పాత్ర మళ్లీ ఇప్పుడు నిత్యామీనన్ కు మరో రూపంలో దక్కింది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో సావిత్ర పాత్రకు నిత్యామీనన్ ను ఎంపిక చేశారు. పాత్రల ఎంపికలో దర్శకుడు క్రిష్ తనదైన ముద్ర చూపిస్తున్నారు. చంద్రబాబునాయుడిగా రానాను అద్భుతంగా మలిచారు. అక్కినేని సుమంత్ గెటప్ కూడా సూపర్ అనేలా చేశారు. మరి ఇప్పుడు సావిత్రిగా నిత్యమీనన్ ను ఎలా చూపిస్తారో చూడాల్సిందే. ఖచ్చితంగా ఈ సినిమా నిత్యామీనన్ కు మంచి పేరు తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే నిత్యా కూడా వచ్చిన పాత్ర ప్రతిదీ చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది.

Next Story
Share it