Telugu Gateway
Movie reviews

‘నన్ను దోచుకుందువటే’ మూవీ రివ్యూ

‘నన్ను దోచుకుందువటే’ మూవీ రివ్యూ
X

సుధీర్ బాబు. హీరోయిజం కంటే కథలనే నమ్ముకుని ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే విడుదలైన ‘సమ్మోహనం’ సినిమా మంచి హిట్ తెచ్చిపెట్టింది ఈ హీరోకు. ఈ సినిమా తర్వాత సొంత బ్యానర్ లో సుధీర్ బాబు హీరోగా చేసిన సినిమానే ‘నన్ను దోచుకుందువటే’. నభా నటేష్ తొలిసారి తెలుగులో ఈ సినిమాలో నటించారు. నన్ను దోచుకుందువటే ప్రేక్షకుల మనసు దోచుకుందా? లేదా ఓ సారి చూద్దాం. హీరో కార్తీక్ (సుధీర్ బాబు) ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో మేనేజర్. తనకు పని తప్ప ఏమీ పట్టదు. ఈ ఐటి సంస్థలో పనిచేసే వాళ్లందరికీ కార్తీక్ అంటే ఓ చండశాసనుడు లాంటి బాస్. ఓ సారి కార్తీక్ నాయనమ్మ చనిపోతే ఊరికి వెళతాడు. అప్పుడు కార్తీక్ తండ్రి (నాజర్) పెళ్ళి ప్రతిపాదన పెడతాడు. దగ్గర బంధువైన అమ్మాయిని పెళ్లి చేసుకోమని కోరతాడు. ఆ అమ్మాయి తాను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని..ఎలాగైనా ఈ పెళ్లి నుంచి తప్పించాలని కార్తీక్ ను కోరటంతో.కార్తీక్ కూడా తాను హైదరాబాద్ లో సిరి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను ప్రేమిస్తున్నట్లు అబద్ధం చెబుతాడు.

అసలు ఎక్కడా లేని సిరిని తెచ్చేందుకు తన ఆఫీసులో పనిచేసే వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తాడు కార్తీక్. ఆ అమ్మాయే సిరి (నభా నటేష్). కాలేజీలో చదువుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ ఉంటుంది. అసలే ఆర్థిక కష్టాలు..అందుకే లవర్ గా నటించటానికి ఒప్పుకుంటుంది. అలా మొదలైన స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే సిరితోనూ కార్తీక్ అంతే కమర్షియల్ గా ఉంటాడు. ఆమె భావోద్వేగాలను ఏ మాత్రం పట్టించుకోడు. షార్ట్ ఫిల్మ్స్ లో నటించే తన ఫ్రెండ్ సిరి కోసం కార్తీక్ చేసే యాక్టింగ్ సీన్లు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ఫస్టాఫ్ లో సరదా సరదాగా..కామెడీ సీన్లతో సినిమా అలా ముందుకు సాగిపోతుంది. సెకండాఫ్ ను ఎక్కువ ఎమోషన్స్ తో నడిపించాలని ప్రయత్నించారు. మేనేజర్ గా సీరియస్ పాత్రలో సుధీర్ బాబు, షార్ట్ ఫిల్మ్స్ లో నటించే చలాకీ అమ్మాయిగా నభా నటేష్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నభా నటేష్ తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారు. అయితే లవ్ ట్రాక్ కు సంబంధించిన స్టోరీలు ఇప్పటికే పలు సినిమాల్లో చూసినవే. సినిమా అంతా లుక్ పరంగా ఎక్కడా రిచ్ నెస్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే సినిమా మొత్తం మీద పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. చివరకు కార్తీక్, సిరిల పెళ్ళితో సినిమాకు శుభం కార్డు వేస్తారు. ఓవరాల్ గా చూస్తే నన్నుదోచుకుందువటే ప్రేక్షకుల మనసు దోచుకోలేకపోయిందనే చెప్పొచ్చు.

రేటింగ్. 2.25/5

Next Story
Share it