Telugu Gateway
Telangana

కెసీఆర్..హరీష్ లపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

కెసీఆర్..హరీష్ లపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
X

పాస్ పోర్టు ల కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 2004 నాటికి కేసులో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే కేసుకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2007 పాస్ పోర్టు కేసు వాంగ్మూలంలో ఆపద్ధర్మ సీఎం కెసీఆర్, మంత్రి హరీష్ రావుల పేర్లు కూడా ఉన్నాయని ఉత్తమ్ సంచలన ఆరోపణలు చేశారు. వీరితోపాటు మరికొంత టీఆర్ఎస్ నాయకుల పేర్లు కూడా ఉన్నాయని తెలిపారు. 2007 మే 22న అప్పటి సీఐడీ డీఎస్పీ గోపాలరాజు నిందితుడు మహ్మద్ రషీద్ అల్వీ అంగీకార వాంగ్మూలం నమోదు చేశారని తెలిపారు. అమెరికా వీసా పొందటానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇఛ్చేవారని అందులో ఉందన్నారు. ఇలా లేఖలు ఇఛ్చిన వారిలో కెసీఆర్ తోపాటు హరీష్ రావు కూడా సిఫార్స్ లేఖలు కూడా ఉన్నాయని తెలిపారు.

అందుకు ప్రతిఫలంగా వారికి కమీషన్లు ముట్టాయని పేర్కొన్నారు. 2005 అక్టోబర్ నుంచి 2006 ఫిబ్రవరి మధ్య కాలంలో ఎనిమిది మందికి వీసాలు ఇవ్వాలని కెసీఆర్ సిఫారసు లేఖలు ఇఛ్చారని వాంగ్మూలంలో ఉందని తెలిపారు. ఈ వ్యవహారంలో ముందు కెసీఆర్, హరీష్ రావులను ఎందుకు అరెస్టు చేయలేదని డీజీపీని ప్రశ్నించినట్లు తెలిపారు. కెసీఆర్ కుటుంబానికి తొత్తులుగా వ్యవహరించే అధికారులకు హెచ్చరిస్తున్నామని ఉత్తమ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతే కాదు..వాంగ్మూలంలోని ఓ పేరాను ఉత్తమ్ చదివి విన్పించారు.

Next Story
Share it