Telugu Gateway
Top Stories

యాపిల్ ఫోన్స్ కూడా ‘డ్యూయల్ సిమ్స్’తో!

యాపిల్ ఫోన్స్ కూడా ‘డ్యూయల్ సిమ్స్’తో!
X

యాపిల్ ఫోన్లకు మార్కెట్లో ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించాలే కానీ..ప్రతి ఒక్కరూ ఈ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తారు. కాకపోతే ఇంత కాలం ఆ ఫోన్లలో ఉన్న ఏకైక సమస్య సింగిల్ సిమ్. ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోయింది. డ్యూయల్ సిమ్స్ తో యాపిల్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. దీంతో ఈ ఫోన్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది. యాపిల్ సంస్థ కొత్తగా మార్కెట్లోకి ఐఫోన్ ఎక్స్ ఎస్, ఐఫోన్ ఎక్స్ ఎస్ మ్యాక్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. లార్జ్ స్కీన్ తో ఇప్పుడు మార్కెట్లో ఐఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.

భారత్ లో ఐఫోన్ ఎక్స్ ఎస్ ధర 99,900 రూపాయలు ఉండబోతోంది. అంటే నికరంగా లక్ష రూపాయలు అన్న మాట. అదే ఐఫోన్ ఎక్స్ ఎస్ మ్యాక్స్ ధర భారతీయ మార్కెట్లో 1,09,900 రూపాయలుగా ఉండబోతోంది. సెప్టెంబర్ 17 తర్వాత ఎప్పుడైనా ఈ ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. చూడాలి ఈ కొత్త ఫోన్లు ఎన్ని రికార్డులు బద్దలు చేస్తాయో. ఫలు కొత్త ఫీచర్లు..అత్యధిక మెమరీ కెసాపిటీతో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

Next Story
Share it