Telugu Gateway
Andhra Pradesh

అమరావతి రైతులతో ‘చంద్రబాబు ఆటలు’!

అమరావతి రైతులతో ‘చంద్రబాబు ఆటలు’!
X

రాజధాని రైతులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిండా ముంచేస్తున్నారా?. అంటే అవుననే చెబుతున్నాయి అధికార వర్గాలు. నాలుగున్నర సంవత్సరాలు పూర్తయినా ఇంత వరకూ శాశ్వత భవనాల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఇది ఒకెత్తు అయితే రాజధానికి భూములిచ్చిన రైతులకు దక్కిన వాణిజ్య స్థలాల విషయంలోనూ వారికి తీరని అన్యాయమే జరగనుంది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నిర్ణయాలే. రాజధాని కోసం అని రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములను చంద్రబాబు తన ఇష్టానుసారం సింగపూర్ కంపెనీలు, వ్యాపార సంస్థలు..కార్పొరేట్ సంస్థలకు కేటాయిస్తున్నారు. ఉదాహరణకు భారీ ఎత్తున స్టార్ హోటల్స్ కు భూములు కేటాయించటానికి రెడీ అయ్యారు. హైదరాబాద్ తరహాలో మెగా కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటల్, ఎగ్జిబిషన్ సెంటర్స్ ఏర్పాటు కానున్నాయి. అమెరికాలోని తెలుగువాళ్ళ కోసం అంటూ ఏపీఎన్ఆర్ టీ పేరుతో ఓ భవనానికి స్థలం కేటాయించారు. ఏపీసీఆర్ డీఏనే స్వయంగా ఐటి కంపెనీల కోసం టవర్స్ నిర్మించనుంది. అంతే కాదు..తొలి దశలో సీఆర్ డీఏ పది ఎకరాల్లో అపార్ట్ మెంట్లు కట్టి ప్రజలకు విక్రయించనుంది.

మరి ఐటి కంపెనీలు, స్టార్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, హౌసింగ్ నిర్మాణాలు కూడా అన్నీ సీఆర్ డీఏ చేస్తుంటే..రాజధానికి భూములిచ్చిన రైతులకు దక్కే 1000, 2000, 3000 గజాల్లో వాళ్లు ఏమి చేస్తారు?. బడా బడా కార్పొరేట్లకు అవసరమైన భూములన్నింటిని ప్రభుత్వమే కారు చౌకగా ఇచ్చేస్తుంటే..రైతులకు దక్కిన వాణిజ్య భూమిలో ఎలాంటి ప్రాజెక్టులు వస్తాయి. అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ఆ ప్రాంతాలను కాదని రైతుల భూమి దగ్గరకు రావాలంటే అది అంత తేలిగ్గా జరిగే పనేనా?. దీనికి తోడు రైతులకు దక్కిన భూమిలో వారు తమ ఇష్టం ఇఛ్చినట్లు చేసుకోవటానికి వీలుండదు. అన్నీ ఆంక్షలు..పరిమితులు. రాజధానికి రైతులు ఇచ్చిన భూములు సొంతంగా ఏమీ చేసుకోలేని పరిస్థితి ఏర్పడనుంది. కొంత మంది ఓ గ్రూప్ గా మారి చేయాలన్న..అగ్రశ్రేణి సంస్థలను ఢీకొట్టి వీరు తమ స్పేస్ ను విక్రయించుకోవటం ఓ పెద్ద సవాల్ గా మారనుంది. అంటే ఇవి కూడా ఎటు చూసిన మళ్లీ బడాబాబుల చేతికి చేరాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. అంతిమంగా రాజధాని కోసం ఉదారంగా భూములిచ్చిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే సాయం ఇదేనా?. అన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it