Telugu Gateway
Politics

కేసులున్నా పోటీ చేయకుండా నిరోధించలేం

కేసులున్నా పోటీ చేయకుండా నిరోధించలేం
X

రాజకీయ నేతలకు పెద్ద ఊరట. ఏ కేసులో అయినా సరే దోషి అని నిరూపితం అయ్యే వరకూ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించటం సాధ్యంకాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రాజకీయ నాయకులపై ఉన్న ఛార్జిషీట్ల ఆధారంగా నిర్ణయాలు సాధ్యం కాదన్నారు. అయితే ఇలాంటి విషయాలపై పార్లమెంట్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలని కోరింది. అయితే ఎన్నికల సమయంలో అభ్యర్దులు తమపై ఉన్న కేసుల వివరాలను పూర్తిగా వెల్లడించాలని..ఆయా పార్టీల కూడా ఆ వివరాలను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. కేసులు ఉన్న నేతలను పోటీ చేయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రాతినిధ్య చ ట్టం ప్రకారం దోషిగా తేలిన వ్యక్తే చట్ట సభల్లో ఉండటానికి అనర్హుడు అవుతాడు. అదే సమయంలో రాజకీయ అవినీతిపై కూడా సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇది సమాజానికి ఎంతో ప్రమాదకరమని పేర్కొంది. కేసులు ఉన్నాయనే కారణంతో పోటీకి అనర్హుడిని చేయటం మొదలుపెడితే దీని చుట్టూ రాజకీయం చేరే అవకాశాలు లేకపోలేదు.

Next Story
Share it