Telugu Gateway
Andhra Pradesh

బాబు ‘బాబ్లీ’ ఉద్యమం కంటే మీడియా ఉద్యమమే ఎక్కువ!

బాబు ‘బాబ్లీ’ ఉద్యమం కంటే మీడియా ఉద్యమమే ఎక్కువ!
X

ఒక్క నోటీసు. వంద స్పందనలు. మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు..పార్టీ సీనియర్లు. ఇతర నాయకులు. ఓ ధర్నా నోటీసుకే ఎంపిక చేసిన మీడియా రెండు రాష్ట్రాలు దద్దరిల్లేలా చేశాయి. మరి ఏపీలో చంద్రబాబునాయుడు సాగిస్తున్న ‘అక్రమ దందాల’కు సంబంధించి నిజంగా మోడీ సర్కారు ఏమైనా నోటీసులు ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి. భరించటమే కష్టం అవుతుంది. నిజంగా అదే జరిగితే అసలు టీవీలు చూడటం కూడా ప్రమాదమే అనే పరిస్థితి. చాలా మంది నిజంగా ఈ బాధ మాకేంటి ‘బాబూ’ అని షాక్ కు గురవ్వాల్సిందే. బాబ్లీ ఎపిసోడ్ లో కొంత మంది టీడీపీ నేతలు స్పందన చూస్తుంటే చంద్రబాబుపై ఎంత కోపం..కసి ఉన్నాయో కన్పిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసే డిమాండ్లు అలా ఉన్నాయి. రండి..చంద్రబాబుకు సంకెళ్లు వేయండి. జైల్లో పెట్టండి చూస్తాం అని సవాళ్ళు విసురుతున్నారు. సహజంగా ఏ కేసుకు సంబంధించి అయినా నోటీసులిస్తున్నా హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేస్తారు. చాలా మంది మంది మీడియా అధినేతలకు ఇలాంటి గతంలో వచ్చాయి. వెంటనే కోర్టుకెళ్లి..ఏదో చెప్పి వచ్చేస్తారు కేసు క్లోజ్.

ఇది ఆ గొడవ చేసేవాళ్ళకు తెలియదా? అనుకుంటే పొరపాటే. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏమి చెప్పదలచుకున్నది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు జడ్జి నోటీసులు జారీ చేయటానికి మోడీకి సంబంధం ఉంటుందా?. నిజంగా చంద్రబాబు అండ్ టీమ్ కు నోటీసులు జారీ చేయాలనుకుంటే ఈ ధర్నా కేసు తప్ప..మరే గొప్ప కేసులు లేవా?. ఏపీలో చంద్రబాబు అడ్డంగా దొరికే స్కామ్ లే ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిని వదిలేసి..టీడీపీ నేతలు చెబుతున్నట్లు ఏ మాత్రం నిలబడని కేసును పట్టుకుని మోడీ, అమిత్ షాలు వేలాడతారా?. అసలు చంద్రబాబుకు సంబంధించి ఇంతకు మించి బలమైన కేసుల ఆధారాలు ఏమీ కేంద్రం వద్ద లేవా?. ఏది ఏమైనా చంద్రబాబు తన కోసం తాను చేసే పోరాటం కంటే ఆయన కోసం ఎంపిక చేసిన మీడియా పోరాటమే ఈ మొత్తం ఎపిసోడ్ ల్ ‘హైలెట్’.

Next Story
Share it