Telugu Gateway
Cinema

‘పంది పిల్ల’ ఫస్ట్ లుక్

‘పంది పిల్ల’ ఫస్ట్ లుక్
X

అదేంటి? పందిపిల్ల ఏంటి..ఫస్ట్ లుక్ ఏంటీ అంటారా?. అవును. మీరు చదువుతున్నది నిజమే. రవిబాబు సినిమా అంతా ఈ పంది పిల్ల చుట్టూనే తిరగనుంది. సినిమా పేరు ‘అదుగో’. అదుగో సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ విడుదల అయింది. అదుగోకు దర్శకత్వం వహిస్తున్నది కూడా రవిబాబే. ఆయన ఈ సినిమాలో నటిస్తున్నారు కూడా. ఫస్ట్ లుక్ లో పిగ్ లెట్ బంటిని ప‌రిచ‌యం చేసారు ద‌ర్శక నిర్మాత‌లు. చెక్క కంచెకు వేలాడుతూ న‌వ్వుతూ ఉన్న పందిపిల్ల అంద‌ర్నీ అల‌రిస్తుంది. ర‌విబాబుతో పాటు ఈ చిత్రంలో అభిషేక్ వ‌ర్మ‌, న‌భా ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు.

దేశ సినిమా చ‌రిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేష‌న్ ను చూపిస్తోన్న సినిమా అదుగో. దీనికోసం చాలా విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా వాడుతున్నారు ర‌విబాబు. షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ద‌స‌రా కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. తెలుగులో అదుగో అనే టైటిల్ తోనే రానున్న ఈ చిత్రం.. మిగిలిన భాష‌ల్లో మాత్రం బంటి పేరుతో విడుద‌ల కానుంది.

Next Story
Share it