Telugu Gateway
Telangana

హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ కు ‘స్పైస్ జెట్’ డైరక్ట్ ఫ్లైట్

హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ కు ‘స్పైస్ జెట్’ డైరక్ట్ ఫ్లైట్
X

అత్యధిక శాతం పర్యాటకులు ప్రయాణించే బ్యాంకాక్ కు దేశీయ విమానయాన సంస్థ ‘స్పైస్ జెట్’ తన సర్వీసులు ప్రారంభిస్తోంది. హైదరాబాద్ నుంచి నేరుగా బ్యాంకాక్ కు సర్వీసులు నడపనుంది. అక్టోబర్ 10 నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయని స్పైస్ జెట్ వెల్లడించింది. బ్యాంకాక్ కు రానుపోను విమాన ఛార్జీ 17299 రూపాయలుగా నిర్ణయించారు. ప్రతి రోజూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ కు స్పైస్ జెట్ విమానం సాయంత్రం 4.30 (16.30)కి బయలుదేరుతుంది. ఈ విమానం బ్యాంకాక్ కు 9.40 (21.40)కి చేరుకుంటుంది.

బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరే విమానం అక్కడ 22.40కి బయలుదేరి..1.40కి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ప్రస్తుతం థాయ్ ఎయిర్ వేస్ కూడా రాత్రి 1.40 ప్రాంతంలో బ్యాంకాక్ కు ఎప్పటి నుంచరో సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ కు వెళ్ళే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో స్పైస్ జెట్ ఈ రూట్ లో సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించింది.

Next Story
Share it