Telugu Gateway
Andhra Pradesh

సోము వీర్రాజు..సాక్ష్యం సినిమా

సోము వీర్రాజు..సాక్ష్యం సినిమా
X

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యులు చేశారు. రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. సోము వీర్రాజు వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారా? లేక చంద్రబాబు అవినీతిపై పోరాటంలో దూకుడు పెంచాలనే ఉద్దేశంతో చేశారా? అన్న అంశంపై రకరకాల వాదనలు విన్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతికి సంబంధించిన పక్కా ఆధారాలతో గత నెలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫిర్యాదు చేశాం. అయితే ఈ విషయంలో గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఓ సారి చూడండి. ‘గవర్నర్‌ ఏం చేస్తున్నారు? అవినీతి చక్రవర్తి చంద్రబాబును బర్తరఫ్‌ చేసే సమయమే లేదా..? ఆంజనేయస్వామి దర్శనాలు, పొర్లుదండాలు పెట్టడానికే ఆయనకు సమయం చాలనట్టుంది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘చట్టాలు తననేమీ చేయలేవనే భావన తో చంద్రబాబు ఉన్నారు. ఆయనకు కొన్ని సంస్థలు, వ్యక్తుల సపోర్టు ఉంది. అందుకే అహంకారం. ఇటీవల నేను సాక్ష్యం సినిమా చూశాను.

ఇక్కడ భగవంతుడు ఉన్నాడు. ప్రకృతి ఉంది. ఎవరూ చూడడం లేదనుకోవద్దు, పంచభూతాల సాక్ష్యం ఉంది. చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలి’ అని హెచ్చరించారు. సీఎం రూలింగ్‌ మానేసి ట్రేడింగ్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఆ ట్రేడింగ్‌తో డబ్బు సంపాదించి మరోసారి గద్దెనెక్కాలని చూస్తున్నారని అన్నారు. ‘భోగాపురం ఎయిర్‌పోర్టు ను ఏఏఐకి కాకుండా జీఎంఆర్‌ సంస్థకు అప్పగించడానికి రంగం సిద్ధం చేశారు. దీని వెనుక భారీ అవినీతి బాగోతం జరిగింది. కరుడుకట్టిన తీవ్రవాదిలా అవినీతిలో చంద్రబాబు కూడా వెనకడుగు వేయట్లేదు. విద్యా రంగంలో అవినీతి భారీగా జరుగుతోంది. వియ్యంకులైన మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు, పురపాలక మంత్రి పి.నారాయణ ఈ రంగాన్ని దోచేస్తున్నారని వీర్రాజు ఆరోపించారు.

Next Story
Share it