Telugu Gateway
Top Stories

టాప్ టెన్ లో సింధు

టాప్ టెన్ లో సింధు
X

క్రీడల్లో పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టం. ఒక్కసారి పేరు తెచ్చుకొంటే చాలు..డబ్బులు అలా వచ్చి పడతాయి. తెలుగు తేజం షట్లర్ పీ వీ సింధు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ప్రపంచ వ్యాప్తంగా క్రీడల్లో ప్రముఖ స్థానాల్లో ఉంటూ.. అత్యధిక ఆదాయం సముపార్జించే వారిలో ఇఫ్పుడు పీ వీ సింధు కూడా చేరింది. ఈ జాబితాను సిద్ధం చేసింది అల్లా టప్పా సంస్థ కాదు..ఏకంగా ఫోర్భ్స్ సిద్ధం చేసిన జాబితాలోని టాప్ టెన్ లో సింధుకు చోటు దక్కింది.

ఇందులో చోటు దక్కించుకున్న భారతీయ క్రీడాకారిణి సింధు ఒక్కరే కావటం విశేషం. టాప్ టెన్ లో సింధు ఏటా 8.5 మిలియన్ డాలర్లు ఆర్జించటం ద్వారా ఏడవ స్థానంలో ఉంది. జాబితాలో మొదటి స్థానం సెరెనా విలియమ్స్ 18.1 మిలియన్ డాలర్లు ఆర్జిస్తోంది. క్రీడల్లో వచ్చే డబ్బుతోపాటు...ఎండార్స్ మెంట్స్ ద్వారా వచ్చే ఆదాయం అంతా కలిపి ఈ లెక్కలు తీశారు. సింధు గత కొంత కాలంగా ప్రముఖ బ్రాండ్స్ ను ఎండార్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Next Story
Share it