Telugu Gateway
Cinema

సవ్యసాచి రిలీజ్ డేట్ ఫిక్స్

సవ్యసాచి రిలీజ్ డేట్ ఫిక్స్
X

ఈ ఏడాది ప్రారంభంలోనే ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ‘మైత్రీ మూవీ మేకర్స్’ టాలీవుడ్ లో యమ జోరు మీద ఉంది. ఈ నిర్మాణ సంస్థ సవ్యసాచి, అమర్..అక్బర్..అంటోని సినిమాలను నిర్మిస్తోంది. అందులో సవ్యసాచి సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. అక్కినేని నాగచైతన్య. నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 2న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ సినిమాకు చందూ మొండెటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’ ఆగస్టు 31న విడుదల కానుంది. ఈ సినిమాలో మాధవన్, భూమిక ప్రత్యేక పాత్రల్లో నటించనున్నారు.

Next Story
Share it