Telugu Gateway
Cinema

సమంత వర్సెస్ నాగచైతన్య

సమంత వర్సెస్ నాగచైతన్య
X

టాలీవుడ్ లో ఇదో కొత్త తరహా పోటీ. అన్నదమ్ముల సవాల్ వంటివి గతంలో ఎన్నో చూశాం. ఇప్పుడు భార్యా, భర్తల సవాల్ అన్న కొత్త ట్రెండ్ మొదలైంది. అదేంటి అంటారా?. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సినిమా, సమంత ప్రధాన పాత్ర పోషించిన యూ టర్న్ సినిమాలు రెండూ ఒకే రోజు విడుదల కానున్నాయి. దీంతో పరిశ్రమల వర్గాల్లో ఆయా సినిమాలపై ఆసక్తి నెలకొంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘యు టర్న్’ సినిమాలో సమంత కీలక పాత్రలో నటించారు.

ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమికా చావ్లాలు ఇతర కీలకపాత్రలు పోషించారు. అయితే నాగచైతన్య, అను ఇమాన్యుయల్ జంటగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా కూడా సెప్టెంబర్ 13నే విడుదల కానుంది. వాస్తవానికి ఆగస్టు 31న విడుదల కావాల్సిన ఈ సినిమా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

Next Story
Share it