Telugu Gateway
Cinema

సమంతకు ‘యూటర్న్’ కు సంబంధం ఏంటి?

సమంతకు ‘యూటర్న్’ కు సంబంధం ఏంటి?
X

యూటర్న్. ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాల్లో బాగా విన్సిస్తున్న పదం. అసలు రాష్ట్రంలో ఎక్కడ యూటర్న్ బోర్డు ఉన్నా సరే..అది తీసేసి చంద్రబాబు బొమ్మ పెడితే చాలు...యూటర్న్ అన్న విషయం అర్థమైపోతుందని ఓ వైసీపీ నాయకుడు కామెడీ చేశారు. అదే సమయంలో టీడీపీ నేతలు ఇప్పుడు జగన్ కూ యూటర్న్ వర్తిస్తుందని ఎద్దేవా చేస్తున్నారు. అంతలోనే హీరోయిన్ సమంత కొత్త ‘యూటర్న్’తో ముందుకొచ్చింది. అయితే ఇది రాజకీయాలకు సంబంధం లేని టర్న్. సినిమా పేరే యూ టర్న్. సమంత కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ శుక్రవారం నాడు విడుదలైంది. ఇందులోనూ సమంత తన నట విశ్వరూపం చూపించినట్లు కన్పిస్తోంది.

సమంత రంగస్థలం సినిమాలో నటనతో తన సత్తా చాటారు. ఇప్పుడు యూటర్న్ సినిమా కూడా అలాగే కన్పిస్తోంది. ‘నువ్వు కథలు చెప్పాలంటే కాస్త నమ్మేట్టు చెప్పమ్మా!. ట్రైలర్ లో ఇది ఓ పోలీసు ఆఫీసర్ సమంతకు చెప్పే డైలాగ్. ఈ ఐదు రోజులు నా లైఫ్ లో జరిగింది అంతా నిజమా?. అబద్ధమా అంటూ సమంత డైలాగు కూడా సినిమాపై అంతే ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ లు ఇతర కీలకపాత్రలు నటించారు. కన్నడంలో హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఆర్కే పురం ఫ్లైఓవర్ మీద జరిగిన ప్రమాదానికి సంబంధించిన రికార్డులు ఉంటే ఇస్తారా? అంటూ సమంత పోలీసు అధికారులను అడుగుతుంది. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉందనే విషయం ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

https://www.youtube.com/watch?v=HG7Lv384yTU

Next Story
Share it