Telugu Gateway
Cinema

శైలజారెడ్డి అల్లుడు టీజర్ విడుదల

శైలజారెడ్డి అల్లుడు టీజర్ విడుదల
X

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుల్ జంటగా నటించిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. సినిమా విడుదల తేదీని ప్రకటించటంతో చిత్ర యూనిట్ ప్రచార జోరు పెంచింది. అందులో భాగంగానే బుధవారం నాడు సినిమా టీజర్ విడుదల చేశారు. ఇందులో పలు సన్నివేశాలు ఆసక్తికరంగా..సరదగా ఉన్నాయనే చెప్పొచ్చు. డైలాగ్ లు సైతం మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నాయి. హీరోయిన్ ను చూసిన హీరో ‘ఈ పిల్లే ఇలా ఉంటే..ఈవిడ తల్లి ఎలా ఉంటుందో ’ అంటూ కూల్ గా ఓ డైలాగ్ చెబుతారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ అత్త క్యారెక్టర్ పోషిస్తున్నారు. హీరోయిన్ అను ఇమాన్యుయల్ డైలాగ్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంది.

నాగచైతన్య వద్దకు వచ్చి ‘ఇప్పుడు నువ్వు లవ్ ప్రపొజ్ చెయ్..ఐ లవ్ యూ టూ అని ఒప్పుకుంటా’ అంటూ చెబుతుంది. నాగచైతన్య తండ్రి నాగార్జునతో కలసి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన రమ్యకృష్ణ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటించిన అల్లరి అల్లుడు సినిమాలోని నిన్ను రోడ్డు మీద చూసింది లగాయిత్తు పాటను ఈ సినిమాలో రీమేక్ చేశారు. ఈ పాటలో తమన్నా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నాగచైతన్య సినిమా విడుదల తేదీని ఆగస్టు 31గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

https://www.youtube.com/watch?v=KJFfZ7CrFnw

Next Story
Share it