Telugu Gateway
Cinema

‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా వాయిదా

‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా వాయిదా
X

కేరళ వరదల ప్రభావం టాలీవుడ్ సినిమాలపై కూడా పడుతోంది. ఈ నెల 31న విడుదల కావాల్సిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని హీరో అక్కినేని నాగచైతన్య స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా అను ఇమాన్యుయల్, అత్తగా రమ్యకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు.

అక్కడి పరిస్థితుల కారణంగా అనుకున్న సమయానికి రీ రికార్డింగ్, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి కాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు నాగచైతన్య. తెలుగులో పరిశ్రమలో మలయాళ పరిశ్రమకు చెందిన చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. అయితే కేరళలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వారు షూటింగ్‌లలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో పాల్గొన లేకపోవటంతో సినిమాలు ఆలస్యమవుతున్నాయి.త్వరలోనే శైలజారెడ్డి అల్లుడు విడుదలకు సంబంధించి కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది చిత్ర యూనిట్.

Next Story
Share it