Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

రాహుల్ ప్రధాని కావాలి

0

ఎవరిదీ ఈ డిమాండ్ అంటారా?. డిమాండ్ కాదు.వేడుకోలు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా శనివారం నాడు తిరుమల వెంకటేశ్వర్వసామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఆరోగ్యం బాగుండాలని, కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని స్వామివారిని మొక్కుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారని ప్రశంసించారు. ప్రియాంక గాంధీ మద్దతు రాహుల్‌కు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టంచేశారు.  బిజెపి పాలనపై ప్రజల్లో విసుగొచ్చిందని అన్నారు. త్వరలోనే దేశంలో ప్రజలు ఓ మంచి మార్పును చూస్తారని వ్యాఖ్యానించారు.

- Advertisement -

వాద్రా శనివారం నాడు స్వామి వారి సుప్రభాత సేవలో ఆయన పాల్గోన్నారు. శ్రీవారిని దర్శించకున్న వాద్రాకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. యూపీఏ హయాంలో రాబర్ట్ వాద్రాపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు..ఆయన కు దేశంలోని విమానాశ్రయాలతోపాటు పలు చోట్ల ‘ప్రత్యేక హోదా’ దగ్గేది. డీఎల్ఎఫ్ నుంచి వాద్రా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. బిజెపి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో వాద్రా వ్యవహారాలపై హడావుడి చేసింది కానీ..తర్వాత  అంతా సద్దుమణిగిపోయింది.

 

Leave A Reply

Your email address will not be published.