Telugu Gateway
Cinema

‘హిట్’ వెంట ఇండస్ట్రీ పరుగులు

‘హిట్’ వెంట ఇండస్ట్రీ పరుగులు
X

ఒక ఫార్ములా హిట్ అయితే..అందరూ అదే బాట పడతారు. ఒక హీరోకు హిట్ వస్తే అందరూ ఆయనే కావాలంటారు. హీరోయిన్లకూ అదే పరిస్థితి. హిట్ వచ్చిన వారినే ఎత్తుకుంటారు ఎవరైనా?. ఈ వ్యవహారం టాలీవుడ్ లో కాస్త ఎక్కువే అని చెప్పుకోవాలి. ఇప్పుడు రెండు సినిమాలతో టాలీవుడ్ లో హిట్ ముద్ర వేసుకున్న హీరోయిన్ రష్మిక మందన. ఆమె చేసిన రెండు సినిమా ఛలో, గీత గోవిందం రెండూ కూడా మంచి ఫలితాన్ని రాబట్టాయి. దీంతో ఆమెకు ఇప్పుడు టాలీవుడ్ లో వరస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. అయితే సినిమాల సెలక్షన్ విషయంలో ఆమె ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వచ్చిన ప్రతి అవకాశానికి ఓకే అనకుండా..కథ ను చూసి మాత్రం సెలక్ట్ చేసుకుంటున్నారు సినిమా. ఈ విషయాన్నే ఆమే స్వయంగా మీడియాకు వివరించారు. గీత గోవిందం సక్సె స్ ఆనందాన్ని ఆమె మీడియాతో పంచుకున్నారు సరదాగా.ఎంత కోపం ఉన్నా లోపల దాచుకోవడానికే ప్రయత్నిస్తా. ‘గీత గోవిందం’ కోసం ఏడు నెలలు కోపంగానే నటించా. సినిమా చివరి 15 రోజులు సరదాగా ఉన్నా. సెట్లో విజయ్‌ దేవరకొండ ‘మేడమ్‌ మేడమ్‌’ అంటుంటే నవ్వు వచ్చేది. మానిటర్‌లో సినిమా చూసుకునే అలవాటు నాకు లేదు. ప్రేక్షకులతో కలిసే చూస్తా. ‘గీత గోవిందం’ అలాగే చూశా. స్క్రీన్‌ మీద నేను ఉన్నాననే ధ్యాసే లేదు. అంత బాగా ఎంజాయ్‌ చేశా. అనవసరంగా చేసే విమర్శల గురించి స్పందిస్తూ నా సమయాన్ని వృథా చేసుకోను. నాకు, రక్షిత్‌కి పెళ్లి జరగదనే వార్తలు విని నవ్వుకున్నా. ఎందుకంటే మేమేంటో మాకు బాగా తెలుసు. నిశ్చితార్థం జరిగినప్పుడు రెండున్నరేళ్లలో చేసుకుందామనుకున్నాం.

ఇప్పుడు ఇద్దరం వృత్తిపరంగా బిజీగా ఉన్నాం. అందుకే ఇంకా తేదీలు అనుకోలేదు అని చెప్పి పుకార్లకు బ్రేకులు వేశారు. నన్ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసింది కన్నడ ప్రజలే. అందుకే అక్కడ సినిమాలు తగ్గించాలనుకోవడం లేదు. ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నా, మరో రెండు సంతకాలు జరుగుతున్నాయి. కథ నాకు నచ్చితే ఏ భాషలో సినిమా చేయడానికైనా రెడీ. అసలు గ్లామర్‌ అంటే ఏంటో నాకు అర్థం కావడం లేదు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమాల్లో నేను ఉండాలనుకుంటున్నా. ప్రస్తుతం తెలుగులో ‘డియర్‌ కామ్రేడ్, ‘దేవదాస్‌’ చిత్రాల్లో నటిస్తున్నా. నన్ను దృష్టిలో పెట్టుకుని ఓ నెగటివ్‌ పాత్ర రాయమని దర్శకుడు పరశురామ్‌కి చెప్పానని తెలిపారు.

Next Story
Share it