Telugu Gateway
Cinema

శ్రీదేవిగా రకుల్!

శ్రీదేవిగా రకుల్!
X

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఈ మధ్యే దగ్గుబాటి రానా చంద్రబాబు పాత్రను పోషిస్తున్నట్లు తేలిపోయింది. అంతే కాదు..చంద్రబాబుతో కూడా రానా సమావేశం అయి పలు అంశాలపై చర్చించారు. ఇప్పుడు మరో కీలక నటి ఎంపిక పూర్తి అయిందని టాక్. దివంగత నటి శ్రీదేవి ఎన్టీఆర్ తో కలసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు హిట్ అన్న భావమే ఉండేది. ఇప్పటికే శ్రీదేవి పాత్రకు చిత్ర బృందం రకుల్ ప్రీత్ సింగ్ తో మాట్లాడినట్లు..ఆమె దీనికి అంగీకరించినట్లు సమాచారం. అయితే అధికారికంగా ఈ విషయం వెల్లడి కావాల్సి ఉంది.

ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రకు బాలీవుడ్ నటి విద్యాబాలన్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఇఫ్పుడు షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. ఈ మధ్యే ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేని పాత్ర కోసం సుమంత్ ను ఎంపిక చేశారు. అయితే శ్రీదేవి పాత్రలో నటించనున్న రకుల్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె తేదీల సర్దుబాటును బట్టి ఆమె పాత్ర షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉందనది టాలీవుడ్ టాక్.

Next Story
Share it