Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘నీవెవరో’ మూవీ రివ్యూ

0

ఆది పినిశెట్టి. టాలీవుడ్ లో విలక్షణ నటుడుగా గుర్తింపు పొందారు. ఓ వైపు హీరో పాత్రలు చేస్తూనే..మరో వైపు నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ కు కూడా వెనకాడకుండా పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ లు నటించిన ‘నీవెవరో’ సినిమా శుక్రవారం నాడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఓ రెస్టారెంట్ ఓనర్ గా కన్పించే ఆది పినిశెట్టి ఫస్టాఫ్ అంతా అంథుడిగా కన్పిస్తాడు. అయితే ఈ పాత్రలో ఆది అంత ఈజ్ చూపించలేకపోయాడని చెప్పొచ్చు. రాజా ది గ్రేట్’ సినిమాలో రవితేజ అంథుడిగా ఎంతో ఈజ్ తో చేయగా..ఆది పినిశెట్టి కొంత ఇబ్బంది పడినట్లు కన్పిస్తుంది. తర్వాత ఓ ప్రమాదంలో గాయపడిన హీరోకు ఆపరేషన్ చేసే సమయంలోనే..కంటి ఆపరేషన్ కూడా  చేయటంతో కళ్లు వస్తాయి. చిన్నప్పటి నుంచే ఆది పినిశెట్టి, రితికా సింగ్ లు స్నేహితులు. కళ్లు కనపడక పోయినా సరే..బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆదిని పెళ్లి చేసుకోవటానికే రితికా సింగ్ సిద్ధపడుతుంది. అయితే ఆది ఓ సారి తన రెస్టారెంట్ లో పరిచయం అయిన తాప్సీతో ప్రేమలో పడతాడు. మరి చివరకు ఎవరి ప్రేమను దక్కించుకుంటాడు..అసలు తాప్సీ ఎందుకు ఆదిని మోసం చేస్తుంది అన్నదే సినిమా. సినిమా ఫస్టాఫ్ కాస్త భారంగా సాగినా..సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ రాకతో సినిమాలో జోష్ పెరుగుతుంది. అయితే సెకండాఫ్ లో ఆది పాత్ర వెనక్కి పోయి వెన్నెల కిషోర్ డామినేట్ చేసినట్లు కన్పిస్తుంది.

వెన్నెల కిషోర్ డైలాగ్ లు..యాక్షన్ ప్రేక్షకులను సరదాగా నవ్విస్తుంది. ఇవాంకా..ట్రంప్..కిమ్ అంటూ వెన్నెల కిషోర్ సినిమా భారాన్ని మోసారని చెప్పొచ్చు. కళ్ళు లేని వారిగా ఉంటూ ..ఓ ప్రత్యేక కళతో కేంద్రం నుంచి అవార్డుల పొందిన జాబితా ప్రకారం వారిని ప్రేమ పేరుతో తాప్సీ మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంది. దీని కోసం ఓ గ్రూప్ ను మెయింటెన్ చేస్తుంది. ఆ బాధితుల జాబితాలోనే ఆది పినిశెట్టి కూడా చేరతారు. భవిష్యత్ లో ఇక ఎవరూ మోసానికి గురికాకూడదనే ఉద్దేశంతో తాప్సీ ఆటకట్టిస్తారు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో తాప్సీ నటన సినిమాకు మంచి ప్లస్‌ అయ్యింది. యాక్షన్‌ సీన్స్‌ లోనూ ఆకట్టుకుంది. రితికా సింగ్‌ పాత్రకు పెద్ద స్కోప్ లేదు. తమిళ సినిమాను దాదాపుగా అదే కథా కథనాలతో టాలీవుడ్‌లో రీమేక్‌ చేశాడు దర్శకుడు హరినాథ్. ఓవరాల్ గా చూస్తే ‘నీవెవరో’ ఓ యావరేజ్ సినిమా.

- Advertisement -

రేటింగ్. 2.25/5

 

Leave A Reply

Your email address will not be published.