Telugu Gateway
Andhra Pradesh

లోకేష్..స్మశానాలనూ జాతికి అంకితం చేస్తారా!

లోకేష్..స్మశానాలనూ జాతికి అంకితం చేస్తారా!
X

రాష్ట్రాన్ని ఒక రాష్ట్రానికి ఇచ్చారు. ఈ మాట చదువుకున్న ఎవరికైనా అర్థం అవుతుందా?. అసలు రాష్ట్రాన్ని ఒక రాష్ట్రానికి ఇవ్వటం అనేది సాధ్యం అవుతుందా?. అసలు దీని భావం ఏంటి?. ఏమో ఈ సంగతి ఏపీ ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఒక్క నారా లోకేష్ కు తప్ప...మరెవరికీ తెలిసే ఛాన్స్ లేదు. ఎందుకంటే అవి ఆయన మాటలే మరి. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ఓ సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతున్నారు. అదేంటి అంటే...గుంటూరులోని కొరిటెపాడు వద్ద అత్యాధునిక సౌకర్యాలతో ఓ స్మశానాన్ని అభివృద్ధి పర్చారు. సోమవారం నాడు లోకేష్ దీన్ని పరిశీలించి..ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి చెందిన ఆహ్వానపత్రికలోనూ..ఇతర మీడియా ఆహ్వానాల్లోనూ మంత్రి నారా లోకేష్ ఈ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన స్మశానాన్ని (వైకుంఠథామం) జాతికి అంకితం చేస్తారని ప్రకటించారు.

స్మశానాన్ని జాతికి అంకితం చేయటం ఏమిటి?. అదేమైనా భారీ సాగునీటి ప్రాజెక్టా?. లేక పోతే రాజధాని నిర్మాణాలా?. జాతికి అంకితటం చేయటానికి. వైకుంఠథామాన్ని ప్రారంభిస్తారనో..లేక మరో పదమో వాడొచ్చు. కానీ ఏకంగా స్మశానాలను కూడా జాతికి అంకితటం చేయటం అంటే మాట భారీగా ఉంటుందని వాడేసినట్లు ఉన్నారు. చూస్తుంటే నారా లోకేష్ స్పీచ్ ల ప్రభావం ఏపీలోని చాలా మందిపై బాగానే పడుతున్నట్లు కన్పిస్తోంది. ఎందుకంటే దేనికి ఏ పదం వాడాలో కూడా అందరూ మర్చిపోతున్నారు మరి. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ 50...55 శాతం మధ్యే పూర్తయిందని అధికారికంగా చెబుతున్న సర్కారు..కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డయాఫ్రం వాల్ ను జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it