Telugu Gateway
Andhra Pradesh

నారా లోకేష్ మంత్రా?.ఐటి ఉద్యోగా?

నారా లోకేష్ మంత్రా?.ఐటి ఉద్యోగా?
X

ఏపీలోని రాజకీయ, అదికార వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. ఐటి ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలే అన్న సంగతి తెలిసిందే. ఏపీలో అత్యంత కీలకమైన ఐటి, పంచాయతీరాజ్ శాఖలు నిర్వహిస్తున్న నారా లోకేష్ కూడా అచ్చం ఐటి ఉద్యోగిలాగానే శుక్రవారం సాయంత్రం అమరావతి నుంచి హైదరాబాద్ కు జంప్. మళ్లీ సోమవారం ఉదయమే కొంత మంది సచివాలయ ఉద్యోగుల తరహాలోనూ అమరావతికి ఇన్. మధ్యలో ఏదైనా ఒక రోజు సెలవు వచ్చింది అంటే ..ఇక లోకేష్ కు పండగేనట. ఉదాహరణకు ఈ వారంలో బుధవారం అంటే ఆగస్టు 15 నుంచి జంప్. రాజకీయ నాయకుడు నిత్యం ప్రజల్లో ఉండాలి. వారి సమస్యలు పరిష్కరించాలి. వారి మన్ననలు పొందాలి. అసలు ఎన్నికల్లో గెలవకుండానే దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్ వచ్చిన అవకాశాలను ఎంత బాగా సద్వినియోగం చేసుకోవాలి?. కానీ లోకేష్ అలా ఏ మాత్రం చేయటంలేదని ఓ సీనియర్ నేతత వ్యాఖ్యానించారు.

వారంలో ఓ ఐదు రోజులు ఉద్యోగిలా హంగామా...తర్వాత వీకెండ్ హాలిడేస్ ఎంజాయ్. పార్టీ నేతలకు...కార్యకర్తలతో అసలు భేటీ అన్న ప్రశ్నే లేదు. అతి కష్టం మీద ఎవరికైనా అపాయింట్ మెంట్ ఇచ్చినా అది కూడా కార్పొరేట్ స్టైల్ లో..అలా వచ్చి ఇలా వెళ్లిపోవాలి. లోకేష్ ఎక్కువ సమయం తాను బాధ్యతలు నిర్వహించే శాఖల్లో స్కామ్ లు చేయటానికి అవకాశాలు ఉన్న ప్రాంతాల అధ్యయనం..అందుకు అనుగుణం స్కీమ్ లు..స్కామ్ లు చేసుకోవటంతోనే సరిపోతుందని ఐటి శాఖకు చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అసలు నా వల్ల...మా నాన్న వల్లే ఏపీ ఇలా పరుగులు పెడుతోందని కలరింగ్ ఇచ్చుకోవటంలో మాత్రం లోకేష్ ముందు ఉంటున్నారు.

అంతే కాదు..అసలు ఫ్యామిలీకి దూరంగా రాష్ట్రం కోసం చెమటోడ్చుతున్నట్లు ప్రచారం. ఐటి శాఖలో ఒక్క ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ స్కామే కాకుండా..విశాఖపట్నం కేంద్రంగా భవనాల నిర్మాణం పేరుతో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో ఐటి ప్రమోషన్ కు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా..వస్తున్న ఫలితాలు మాత్రం అంతగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేవు. పార్టీ విషయానికి వస్తే అసలు సీనియర్ నేతలకే లోకేష్ అపాయింట్ మెంట్ కష్టంగా మారిపోతోంది. ఇక కార్యకర్తలు అయితే లోకేష్ ను కలవటం అనేది జరిగే పనికాదు. ఎప్పుడైనా జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రం అక్కడ నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున పోనీ వరస పెట్టి జిల్లాలు తిరుగుతూ నేతలు..క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్దం చేస్తున్నారా? అంటే అదీలేదు. ఎక్కడైనా జిల్లాలకు వెళ్లి లోకేష్ ప్రసంగాలు చేసినా వాటి వల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వంలో జరిగే ప్రతి పనినీ చంద్రబాబు, లోకేష్ లే కంట్రోల్ చేస్తున్నారనే విమర్శలు పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నాయి.

Next Story
Share it