Telugu Gateway
Politics

‘అవిశ్వాసం’పై మోడీ వెరైటీ రియాక్షన్

‘అవిశ్వాసం’పై మోడీ వెరైటీ రియాక్షన్
X

సహజంగా అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్రతిపక్షాలపై అధికార పార్టీ విమర్శలు చేస్తుంది. కానీ భారీ మెజారిటీతో ఈ తీర్మానాన్ని నెగ్గిన ఆనందంలో ఉన్న ప్రధాని మోడీ ఈ అంశంపై వెరైటీగా స్పందించారు. అవిశ్వాసం పెట్టిన ప్రతిపక్ష పార్టీలకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఈ తీర్మానం పెట్టేందుకు ప్రధాన కారణమైన ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీని చాలా లైట్ గా తీసుకున్నారు మోడీ. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ టార్గెట్ గానే విమర్శలు చేశారు. అవిశ్వాస తీర్మానంతో ప్రతిపక్షాల అజ్ఞానం, అవగాహన లేమి బట్టబయలు అయ్యాయని ఎద్దేవా చేశారు.

బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మంగళవారం ఆయన ప్రసంగించారు. తీర్మానంపై చర్చలో హోంమంత్రి రాజ్‌నాథ్‌ చేసిన ప్రసంగాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన సమర్థవంతంగా విపక్షాలకు సమాధానం చెప్పారన్నారు. అవిశ్వాస తీర్మానం గురించి భేటీలో పాల్గొన్న బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, కేంద్రమంత్రులు గడ్కరీ, సుష్మా స్వరాజ్‌ తదితరులు కూడా మాట్లాడారని కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ మీడియాకు వివరించారు. సాధారణంగా ప్రభుత్వ పక్షం మెజారిటీ కోల్పోయినప్పుడు అవిశ్వాస తీర్మానం పెడ్తారని, కానీ ఈ సందర్భంలో అలాంటి పరిస్థితేమీ లేదని వారు విమర్శించారన్నారు.

Next Story
Share it