Telugu Gateway
Politics

మెరీనా బీచ్ లోనే కరుణానిధి అంత్యక్రియలు

మెరీనా బీచ్ లోనే కరుణానిధి అంత్యక్రియలు
X

ఉత్కంఠ వీడిండి. డీఎంకె కోరుకున్నదే జరిగింది. మెరీనా బీచ్ ప్రాంతంలోనే కరుణానిధి అంత్యక్రియలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంగళవారం రాత్రి నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. హైకోర్టు తీర్పుతో డీఎంకె వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. బుధవారం సాయంత్రం మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్ వద్ద ఈ అంత్యక్రియలు సాగనున్నాయి. ఇక్కడే తమిళనాడుకు చెందిన ప్రముఖుల స్మారకాలు ఉన్నాయి. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం తొలుత మెరీనా బీచ్ ప్రాంతంలో అంత్యక్రియలకు అభ్యంతరం వ్యక్తం చేసి..ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ప్రకటించింది. దీంతో వెంటనే డీఎంకె హైకోర్టును ఆశ్రయించి అనుమతి దక్కించుంది. మెరీనా బీచ్ ప్రాంతంలో అంత్యక్రియలు జరపకూడదు అంటూ గతంలో దాఖలైన పిటీషన్లను కూడా కోర్టు కొట్టేసింది.

కరుణానిధి ప్రస్తుత సీఎం కానందునే అక్కడ అంత్యక్రియలకు నిరాకరిస్తున్నారని, ఆయన చేసిన సేవలను మర్చిపోయారా అని డీఎంకే మండిపడింది. మెరీనా బీచ్ లో స్మారకాల నిర్మాణాలకు చెన్నయ్ మునిసిపల్ కార్పొరేషన్ అనుమతించిన విషయాన్ని డీఎంకె ప్రస్తావించింది. అయితే వాదనల సమయంలో సర్కారు తరపు న్యాయవాది డీఎం కె తరపు లాయర్లు మేనేజ్ చేసి కొన్ని పిటీషన్లు ఉపసంహరింపచేశారన్న వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Next Story
Share it