Telugu Gateway
Andhra Pradesh

ఆ కుంభకోణాలు ఎక్కడ కుటుంబరావు?

ఆ కుంభకోణాలు ఎక్కడ కుటుంబరావు?
X

‘అత్యంత పెద్ద కుంభకోణాలు రెండు. మార్క్ మై వర్డ్స్ . ఇదే మీ మీడియా ముందు నెక్ట్స్ వన్ మంత్ లో రివీల్ చేయబోతున్నా. కేంద్రంలో ప్రకంపనలు వచ్చేవి చెబుతున్నా నేను. కాన్ఫిడెంట్ గా చెబుతున్నా.’ ఇవీ ఏపీ ప్రణాళికా ఉపాధ్యక్షుడు కుటుంబరావు చేసిన వ్యాఖ్యలు. జూన్ 5న ఆయన ఈ ప్రకటన చేశారు. ఆయన ఈ ప్రకటన చేసి రెండు నెలలు గడిచిపోయింది కూడా. ఇంత వరకూ కేంద్రంలో ప్రకంపనలు కాదు..కదా?. కనీసం గాలి కూడా వీయటం లేదు కుటుంబరావు దెబ్బకు. తన కుంభకోణాల టీజర్ లో భాగంగా ఎస్సార్ ఆయిల్ అమ్మకం వ్యవహారాన్ని మాత్రం బయటపెట్టారు. ఇందులో భారీ ఎత్తున పన్ను ఎగవేతలు జరిగాయని..దేశానికి ప్రధాని మోడీ నష్టం చేశారని ఆరోపించారు. కానీ ఈ ఆరోపణలను అధికార బిజెపినే కాదు..ఎవరూ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఆ రెండవ కుంభకోణం ఏమిటో ఇంత వరకూ బయటకు రాలేదు. కుటుంబరావు ప్రకటన చేసి రెండు నెలలు కావస్తున్నా...ఢిల్లీలో ప్రకంపనల జాడే లేదు. ఎస్సార్ ఆయిల్ విషయంలో న్యాయపోరాటం కూడా చేస్తామని ప్రకటించారు.

కానీ ఆ దిశగా ఇంతవరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడినట్లు లేదు. ఏపీ ప్రభుత్వమే పదుల సంఖ్యలో కుంభకోణాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. బిజెపి నేతలు కూడా ఏపీలో సాగుతున్న అవినీతిపై భారీ ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఎలాంటి చర్యలు చేపట్టేందుకు సాహసించటం లేదు. పలు కేసుల్లో పక్కా ఆధారాలు ఉన్నా కూడా కేంద్రంలోని బిజెపి సర్కారు చంద్రబాబు ప్రభుత్వంపై చర్యలకు వెనకాడుతోంది. టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని దారిమళ్ళించేందుకు టీడీపీ పలు మార్గాలను అన్వేషిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే కుటుంబరావు కేంద్రంపై ఆరోపణలు చేసినట్లు ఉన్నారు తప్ప...అందులో విషయం ఉన్నట్లు కన్పించటం లేదు. కుటుంబరావు బయటపెట్టిన ఎస్సార్ ఆయిల్ అమ్మకం వ్యవహారం కాస్తా తుస్సుమంది. మరి ఆ రెండవ కుంభకోణం ఏమిటో ఇంతకూ ఎవరికీ తెలియదు.

ఆయన తనకు తాను పెట్టుకున్న గడువు దాటే చాలా రోజులైంది. మోడీ సర్కారుపై ప్రస్తుతం ప్రధానంగా విన్పిస్తున్న ఆరోపణ రాఫెల్ కుంభకోణం. ఇది ఒకప్పటి భోపోర్స్ కంటే చాలా పెద్దది. ఓ వైపు కేంద్రంలో మోడీ సంగతి తేల్చేవరకూ నిద్రపోను అని గంభీరమైన ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు మాత్రం ఈ విషయంపై మౌనం దాల్చుతున్నారు. నిజంగా చంద్రబాబుకు మోడీపై పోరాడాలనే ఉంటే...ఇదే ఎస్సార్ ఆయిల్ అక్రమాలను ఢిల్లీకి వెళ్లి మిగిలిన పార్టీలకు ఎందుకు ఇవ్వటం లేదు. ఆయన అసలు లక్ష్యం పోరాటం కాదు. ఏదో ఒక సాకు చెప్పి...కేసులు తన వరకూ రాకుండా చూసుకోవటమే అనే విమర్శలు విన్పిస్తున్నాయి. రాఫెల్ గురించి మాట్లాడితే తన మిత్రడు అనిల్ అంబానీకి ఎక్కడ కోపం వస్తుందో అని ఆగిపోతున్నట్లు ఉన్నారు.

Next Story
Share it