Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

హైదరాబాద్ లో ‘ఐకియా’ స్టోర్ ప్రారంభం

0

దేశంలోనే తొలి ఐకియా ఫర్నీచర్ స్టోర్ గురువారం నాడు హైదరాబాద్ లో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్, ఐకియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ స్టోర్ ప్రారంభోత్సవంతో స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నీచర్‌ దిగ్గజం ఐకియా భారత్‌కు వచ్చేసినట్లు అయింది. తెలంగాణ ద్వారా మరో ప్రముఖ బ్రాండ్‌ భారత్‌లోకి ప్రవేశించిందని మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. హైటెక్‌ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఒకేసారి వెయ్యి మంది కూర్చునే సామర్థ్యం ఉన్న రెస్టారెంట్‌ను కూడా ఐకియా ఈ స్టోర్‌లో ఏర్పాటు చేసింది. 7,500 రకాల ఫర్నిచర్, ఫర్నిషింగ్, వంటింటి సామగ్రిని ఇక్కడ విక్రయిస్తారు. దాదాపు 1,000 రకాల ఉత్పత్తుల ధర రూ.200 లోపే ఉండటం విశేషం.

- Advertisement -

ప్రత్యక్షంగా ఈ స్టోర్‌లో 950 మంది పనిచేస్తున్నారు. ఐకియా విధానం ప్రకారం వీరిలో సగం మంది మహిళలున్నారని ఐకియా రిటైల్‌ ఇండియా సీఈవో పీటర్‌ బెజెల్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ స్టోర్‌ ద్వారా పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.  దేశంలో 40 నగరాల్లో ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలన్నది ఐకియా ప్రణాళిక. 2025 నాటికి 25కు పైగా సెంటర్లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో కంపెనీ సుమారు రూ.5,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ముంబై స్టోర్‌ 2019 వేసవిలో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత బెంగళూరు, గురుగ్రామ్‌లో సైతం ఐకియా కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.

 

Leave A Reply

Your email address will not be published.