Telugu Gateway
Andhra Pradesh

ఏపీ సర్కారుతో హోలీటెక్ ఎంవోయు

ఏపీ సర్కారుతో హోలీటెక్ ఎంవోయు
X

ఆంధ్రప్రదేశ్ సర్కారుతో చైనాకు చెందిన హోలీటెక్ టెక్నాలజీస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం కంపెనీ ఏపీలోని తిరుపతి దగ్గర 1400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడంతోపాటు ఆరు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో హోలీటెక్ కంపెనీ ప్రతినిధులు ఏపీ సర్కారుతో ఎంవోయు చేసుకున్నారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ కంపెనీ దేశంలో ఏర్పాటు చేస్తున్న తొలి యూనిట్ ఇదేనని తెలిపారు.

హోలీటెక్ తిరుపతిలో నెలకొల్పనున్న యూనిట్ లో థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్ (టీఎఫ్ టి) స్క్రీన్స్, టచ్ స్క్రీన్ మాడ్యూల్స్, ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్కూట్స్, కెమెరా మాడ్యూల్స్, ఫింగర్ ప్రింటర్ సెన్సార్స్ ఉత్పత్తి చేయనుంది. వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లోనే కంపెనీ ఉత్పత్తి ప్రారంభించనుంది. తిరుపతి సమీపంలో ఈ కంపెనీకి సర్కారు 75 ఎకరాల భూమితోపాటు పలు రాయితీలు..ప్రోత్సాహకాలు అందించనుంది. హోలీటెక్ కు చైనాలో 16 ఫ్యాక్టరీలు ఉన్నాయని, భారత దేశంలో ఇదే మొదటి ఫ్యాక్టరీ అని అన్నారు.

Next Story
Share it