Telugu Gateway
Telangana

తెలంగాణలో టీడీపీ ఎవరికి మద్దతు ఇస్తే వారిదే అధికారం

తెలంగాణలో టీడీపీ ఎవరికి మద్దతు ఇస్తే వారిదే అధికారం
X

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలసి పోటీచేసే ఛాన్స్ లు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయితే బహిరంగంగానే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కలసి ముందుకు సాగటానికి రెడీ అంటున్నారు. ఈ తరుణంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో ఆ పార్టీనే క్లియర్ కట్ గా అధికారంలోకి రావటం ఖాయం అని స్పష్టం చేశారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం ప్రస్తావించారు.

తెలంగాణలో నాయకులు పోయినంత మాత్రాన పార్టీ పోలేదని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఓ పెద్ద యూనివర్శిటీ . చాలా మంది విద్యార్ధులు వస్తూ ఉంటారు..పోతూ ఉంటారు. తెలంగాణలో టీడీపీ ఉనికిని తప్పుకుండా కాపాడతాం. తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతం నుంచి పోవటం అనేది అసాధ్యం. బిజెపి తనంతట తాను మాకు చెప్పకుండానే తెలంగాణలో మా నుంచి విడిపోయారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ పార్టీకి సమయం ఇవ్వలేకపోవటం అనేది వాస్తవమే అని గరికపాటి తేల్చిచెప్పారు.

Next Story
Share it