Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఒకరు గన్ పట్టారు..మరొకరు!

0

ఒకటే బెడ్. ఒక పక్కన నాగార్జున..మరో వైపు నాని. నాగార్జున చేతిలో గన్..మందు బాటిల్ ఉంటే…నాని మెడకు స్టెతస్కోప్ ఉంది. ఇది దేవదాసు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్. ‘‘టైటిల్‌ ప్రకారం నా పక్కన పారు ఉండాలి. కానీ ఈ దాసుగాడు ఉన్నాడు’’ అంటున్నారు నాగార్జున. ‘‘1996లో నాగార్జున ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా విడుదలైనప్పుడు నాగ్‌ సార్‌ స్క్రీన్‌పై ఉన్నారు. నేనేమో టిక్కెట్స్‌ కోసం థియేటర్స్‌ ముందు ఉన్న క్యూలో ఉన్నా. ఇప్పుడు ఇద్దరం కలిసి ‘దేవదాస్‌’ ఫస్ట్‌ లుక్‌లో ఇలా ఉన్నాం’’ అన్నారు నాని. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న మల్టీస్టారర్‌ మూవీనే ఈ దేవదాస్.

- Advertisement -

ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా  ఆకాంక్షా సింగ్, నానికి జోడీగా రష్మిక మందన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. ధర్మరాజు సమర్పణలో అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. డాన్‌ దేవ్‌ పాత్రలో నాగార్జున, డాక్టర్‌ దాస్‌ పాత్రలో నాని నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో ఇఫ్పుడు హల్ చల్ చేస్తోంది. దేవదాస్ సినిమా ‘క్లైమాక్స్‌ మినహా షూటింగ్‌ అంతా పూర్తయింది. సెప్టెంబర్‌ 27న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నామని తెలిపారు అశ్వనీదత్‌.

Leave A Reply

Your email address will not be published.