Telugu Gateway
Andhra Pradesh

రాజధాని ‘బొమ్మలతో’ చంద్రబాబు ప్రచారం షురూ

రాజధాని ‘బొమ్మలతో’ చంద్రబాబు ప్రచారం షురూ
X

ఎన్నికల సమయం దగ్గరకొస్తోంది. ప్రభుత్వ ఖర్చుతో చంద్రబాబు ప్రచారం షురూ చేశారు. టీవీల నిండా ప్రకటనల జోరు పెంచారు. అందులో ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్ లను చూపిస్తున్నారు. అంత వరకూ ఓకే. కానీ ఇంత వరకూ ‘డిజైన్ల’ దశ కూడా దాటని రాజధాని బొమ్మలను కూడా ప్రచారానికి వాడేస్తున్నారు. ఇప్పుడు టీవీల్లో ఆ బొమ్మలు చూసిన వారెవరు ఎవరైనా చంద్రబాబు అచ్చం ఇలాంటి రాజధాని కట్టేశారనే అనుకోవటానికేమో ఈ బొమ్మలతో ప్రచారం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ‘అమరావతి’ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటి నుంచి ప్రజలను ‘మాయ’ చేస్తూనే ఉన్నారు. అసలు రాజధాని నిర్మాణమే సింగపూర్ కంపెనీలు చేస్తున్నాయని నమ్మించి..చివరకు వాళ్ళను తెలివిగా ‘ప్రైవేట్ వ్యాపారం’లో దింపారు. రైతులిచ్చిన భూమి, సర్కారు సొమ్ముతో మౌలికసదుపాయాలు కల్పించి ‘సింగపూర్ సంస్థల’కు లాభాలు తెచ్చి పెట్టి తద్వారా లబ్ది పొందే ప్లాన్ లో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. కేంద్రంతో తలెత్తిన విభేదాలను కూడా తెలివిగా తన ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.

వాస్తవానికి విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వాలి. కానీ ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించేసి..ఓ వైపు కేంద్రంతో పోరాడుతున్నట్లు ప్రజలను నమ్మించి...బాండ్లు, భారీ ఎత్తున అప్పులు సేకరించి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇలా సొంత నిధులతో అయితే రేట్లు ఎంత ఎక్కువ పెట్టినా ఎవరూ అడగరు. అదే కేంద్రం ఇచ్చిన నిధులు అయితే ప్రతి దానికి ఓ లెక్క ఉంటుంది. విభజన చట్టంలో రాజధానికి నిధులు ఇవ్వాలని ఎంతో స్పష్టంగా ఉన్నా..ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే మార్గాన్ని పూర్తిగా వదిలేసి...చంద్రబాబు అప్పులు..బాండ్లపైనే ఆధారపడుతున్నారు. రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు తన అక్రమార్జనకు ఓ ఓ అస్త్రంగా వాడుకుంటున్నారని మౌలికసదుపాయాల శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. వాస్తవ రాజధానికి సంబంధించి ఇప్పటివరకూ ఒక్క అడుగు ముందుకు పడకపోయినా ప్రచార చిత్రాల్లో మాత్రం ఈ బొమ్మలు పెట్టేసి హంగామా చేస్తున్నారు. చేేసిన పనులు చెప్పుకోవటం ఓకే కానీ..అసలు లేని రాజధానిని ఉన్నట్లు చూపించటమే వింత.

Next Story
Share it