Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

అశోక్ బాబు ‘టీడీపీ రక్షకుడా!’

0

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అంత నిరాశలో ఉన్నారా?. ఓ ఎన్జీవో నాయకుడు పార్టీలోకి ప్రవేశిస్తే టీడీపీ గెలుపు అవకాశాలు అంతగా మెరుగుపడతాయా?. బహిరంగ వేదికలపై నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే అశోక్ బాబును పార్టీలోకి రావాలని ఆహ్వానించటం వెనక మతలబు ఏమిటి?. చంద్రబాబు అంత బలహీనంగా ఉన్నారా?. అశోక్ బాబు టీడీపీ రక్షకుడిగా మారతారని చంద్రబాబు భావిస్తున్నారా?. ఇవి తెలుగుదేశం పార్టీ నేతల అనుమానాలు. చంద్రబాబు తీరు చూసి టీడీపీ సీనియర్ నేతలు సైతం షాక్ కు గురవుతున్నారు. అశోక్ బాబు గురించి చంద్రబాబు ఎందుకంత తాపత్రయ పడుతున్నారని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఈ మధ్యే నవ నిర్మాణదీక్షల సమయంలో కూడా చంద్రబాబు రాజకీయాల్లోకి రావాల్సిందిగా అశోక్ బాబును కోరారు.

- Advertisement -

మళ్లీ మంగళవారం నాడు కూడా చంద్రబాబు అదే డిమాండ్ చేశారు. అంతే కాదు..పలు ఆఫర్లు కూడా ప్రకటించారు. ఏలూరులో ఏపీ ఎన్జీవో హో భవన్  ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న అశోక్‌బాబు టీడీపీలో చేరి క్రీయాశీలకంగా వ్యవహరించాలని కోరారు. ఏపీ విభజన సందర్భంగా ఎన్జీవోలు తీవ్ర పోరాటాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అశోక్‌ బాబు ఎప్పుడు పార్టీలో చేరినా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎందుకు చంద్రబాబు బహిరంగంగా ఇంతగా అశోక్ బాబును ప్రాధేయపడాల్సిన అవసరం ఏముందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

 

Leave A Reply

Your email address will not be published.