Telugu Gateway
Movie reviews

‘విజేత’ మూవీ రివ్యూ

‘విజేత’ మూవీ రివ్యూ
X

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చాడు. చిరంజీవి అల్లుడే ఈ కళ్యాణ్ దేవ్. కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, మురళీ శర్మలు కీలకపాత్రల్లో నటించిన ‘విజేత’ సినిమా గురువారం నాడే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా స్టోరీ పాతతే అయినా...కథనం మాత్రం మెప్పిస్తుంది. హీరో...హీరోయిన్ల మధ్య పెద్దగా ప్రేమ సన్నివేశాలు..డ్యూయెట్లు వంటి హంగామా లేకుండా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సినిమాను దర్శకుడు రాకేష్ శశి తెరకెక్కించారు. కథ చూస్తే ఎన్నో సినిమాల్లో చూసిందే. ఎదురింట్లో కొత్తగా అద్దెకు దిగిన అమ్మాయికు..లైన్ వేయటం...తండ్రి కష్టాలను పట్టించుకోకుండా జులాయిగా తిరిగే కొడుకు వంటి సీన్లు ఎన్నో సినిమాల్లో చూసి చూసి ఉన్నవే. కానీ ఈ సినిమాను దర్శకుడు ఓ కొత్త కాన్సెప్ట్ తో ముందుకు తీసుకెళ్ళాడు. అదే ‘సర్ ప్రైజ్ ఈవెంట్స్’. పుట్టిన రోజు..లవర్ కు ప్రేమ ప్రపోజ్ చేయటంలో సర్ ప్రైజ్...ప్రమోషన్ పొందేందుకు బాస్ ను సర్ ప్రైజ్ చేయటం. ఇలా మిత్రులతో కలసి సర్ ప్రైజ్ ఈవెంట్స్ కోసం ఓ కంపెనీ పెడతాడు కళ్యాణ్ దేవ్. చేసిన తొలి ప్రయత్నాలు అన్నీ బెడిసికొడతాయి. అంతే కాదు..వీళ్ళ బాధితుడు ఒకడు ఈ ఈవెంట్స్ కంపెనీ ఘనకార్యాలను వీడియో తీసి మరీ యూట్యూబ్ లో పెడతాడు. అంతే అది వైరల్ అవుతుంది.

కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా...ఫెయిల్యూర్స్ వీళ్లను దెబ్బతీస్తాయి. ఈ తరుణంలో ఎదురింటి అమ్మాయి అదేనండి హీరోయిన్ మాళవిక నాయర్ తమ బాస్ దగ్గర ఓ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెబుతుంది. ఆ సమయంలో వారి కుటుంబలో విభేదాలు తీవ్రరూపం దాలుస్తాయి. దాన్నే అవకాశంగా మలుచుకుని..తన కంపెనీని నిలబెట్టుకుంటాడు హీరో. తొలి సినిమానే అయినా హీరో కళ్యాణ్ దేవ్ నటనలో ఈజ్ చూపించాడు. ముఖ్యంగా చికెన్ పై వచ్చే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ సెంటిమెంట్స్, భావోద్వేగాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. ఓ పెళ్ళిలో ఫోటోగ్రాఫర్ చేసే హడావుడి సమయంలో మురళీ శర్మ ఆ ఫోటోగ్రాఫర్ కు అసలు ఫోటోలు ఎందుకు..ఎలా తీయాలో చెప్పిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్టాఫ్ సినిమా అంతా కూల్ గా సాగిపోతోంది. సెకండాఫ్ లో సెంటిమెంట్ సీన్లు ఉన్నా..ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి తొలి సినిమాతోనే కళ్యాణ్ దేవ్ ‘విజేత’గా నిలిచాడనే చెప్పొచ్చు.

రేటింగ్. 2.75/5

Next Story
Share it