Telugu Gateway
Andhra Pradesh

మూడు లక్షలిస్తారా..మా ఛానెళ్ళో ఇంటర్వూ వేస్తాం

మూడు లక్షలిస్తారా..మా ఛానెళ్ళో ఇంటర్వూ వేస్తాం
X

ఇదీ ఓ ప్రముఖ ఛానల్ గత కొన్ని రోజులుగా సాగిస్తున్న దందా. ఎన్నికల సమయంలో ‘ప్యాకేజీలు’ వీటికి అదనం. ఆ ఛానల్ లో ఇంటర్వూ ప్రసారం కావాలంటే మూడు లక్షల రూపాయలు చెల్లించాలి. అవతలి వ్యక్తి ఆర్థికంగా ‘సౌండ్’ అయితే రేటు మారొచ్చు. అది ‘బేరం’ చేసే వ్యక్తిని బట్టి కూడా ఉంటుంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి..కొత్తగా ఎన్నికల బరిలో ఉండాలనుకునే వారికి అయితే రెండు లక్షల రూపాయలు. ఆ ఇంటర్వూ రెండుసార్లు ప్రసారం అవుతుంది. ఎంత లేదన్నా పాపులర్ ఛానల్ కదా?. ఆ మాత్రం సమర్పించుకోవటానికి చాలా మంది రెడీ అయిపోయారు. ఈ వ్యవహారం ఇఫ్పడు మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వార్త ప్రాముఖ్యతను బట్టి ‘ప్రసారం’ అయ్యేది. పేపర్లలో అయితే ప్రచురణకు నోచుకునేది. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ప్రతి దానికీ ప్యాకేజీనే. ప్యాకేజీ ప్రకారమే కవరేజ్. కొద్ది రోజుల క్రితం ఏపీకి చెందిన ఓ అధికార పార్టీ ఎంపీ తన కార్యక్రమం కవరేజ్ కోసం ప్రధాన ఛానళ్లలో కొన్నింటికి 25 లక్షల రూపాయల లెక్కన, రేటింగ్ లో కాస్త వెనకబడి ఉన్న వాటికి 10 నుంచి 12 లక్షల రూపాయల వరకూ చెల్లించారు.

ఈ విషయంలో ఒకరిద్దరు మినహాయింపు ఉన్నారనుకోండి. ఎన్నికల సమయంలో ప్రతి కవరేజ్ కూ ‘లెక్కే’. నేతలకు కూడా అది అవసరం పడుతుంది. ఎందుకుంటే ఎంత ప్రచారంలో ఉంటే వాళ్ళకు అంత లాభం. విచిత్రం ఏమిటంటే ఆ ఛానల్ లక్షలకు లక్షలు ఇస్తే చాలు మా ఛానెళ్ళో ఇంటర్వూలు ఇస్తామన్నా చాలా మంది క్యూ కడుతున్నారు. ఆ ఛానల్ చూసే వాళ్ళకు కూడా ఈ మధ్య ఓ డౌట్ వస్తోంది. వీళ్ళు పెద్దగా పాపులర్ కాదు..ఎందుకింత హంగామా చేస్తున్నారు అన్న చర్చ సాగుతుంది. ప్రధాన ఛానల్స్ ఎన్నికల సమయంలో ఈ తరహా కార్యక్రమాలు చేపడతాయి.

రకరకాల పేరుతో వాళ్ళను ప్రొజెక్ట్ చేస్తూ తమ పని చేసుకుంటాయి. కాకపోతే సదరు ఛానల్ అందరి కంటే ముందుగా చాలా ‘ముందు’ చూపుతో ఈ ప్యాకేజీల వ్యవహారం స్టార్ చేసింది. ఈ తరహా వ్యవహారాలు ఎన్నికల సమయంలో పీక్ కు వెళ్ళే అవకాశం ఉంది. ఏపీలో అయితే ఒక్కో నియోజకవర్గానికి ఇప్పుడు ఓపెన్ కేటగిరి సీట్లలో అయితే కనీసం 15 కోట్ల రూపాయలు ఎన్నికల కోసం ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి. అలాంటి వారికి ఇది ఓ లెక్కా అని ఓ నేత వ్యాఖ్యానించారు. తెలంగాణలో అయితే ఖర్చు ఆ రేంజ్ లో ఉండకపోవచ్చు కానీ..ఈ సారి మాత్రం గత ఎన్నికల కంటే పెరగటం ఖాయం అనే ప్రచారం ఉంది.

Next Story
Share it