Telugu Gateway
Movie reviews

‘తేజ్ ఐ లవ్ యూ’ మూవీ రివ్యూ

‘తేజ్ ఐ లవ్ యూ’ మూవీ రివ్యూ
X

సాయిధరమ్ తేజ్. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా కాంపౌండ్ హీరో. ఈ కుర్ర హీరో చేసిన సినిమాలు అన్న వరస పెట్టి ఫట్ అనటంతో ఈ సారి హిట్ కోసం ఓ లవ్ స్టోరీని నమ్ముకున్నాడు. అందునా కరుణాకరన్ దర్శకుడు కావటంతో ప్రేక్షకులు సైతం దీనిపై ఓ మోస్తరు అంచనాలు పెట్టుకున్నారు. సాయిధరమ్ తేజ్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఓ అందమైన ఉమ్మడి కుటుంబంలోని కుర్రాడే సాయిధరమ్ తేజ్. చిన్నప్పుడే తల్లితండ్రులు చనిపోవటంతో పెద్దనాన్న, బాబాయిలతో కూడిన ఫ్యామిలీలో పెరుగుతాడు. ఓ రోజు సైకిల్ పై ట్యూషన్ కు వెళ్ళి వస్తూ ఉండగా కారు ట్రబుల్ ఇఛ్చి..కష్టాల్లో ఉన్న మహిళను తన సైకి ల్ పై ఎక్కించుకుని పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ కు చేరుస్తాడు. ఆ మహిళను మధ్యలో రౌడీలు రేప్ చేసేందుకు ప్రయత్నిస్తే వాళ్ళను బండరాయితో కొట్టి చంపేస్తాడు. అయితే తనను కాపాడిన కుర్రాడికి ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్న ఆమెను భర్త అడ్డుకుని కష్టపడి లండన్ లో ఉద్యోగం సాధించి ఈ సమయంలో కోర్టుల చుట్టూ ఎలా తిరుగుతామని బలవంతంగా పంపిస్తాడు. ఆ కుర్రోడికి తాను సాయం చేస్తానని భార్యను నమ్మించి మోసం చేస్తాడు. ఆ కుర్రోడికి సాయంగా ఇచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెడతాడు.

తల్లి మాటను నిలబెట్టేందుకు ఇండియాకు తిరిగొచ్చిన అమ్మాయే నందిని (అనుపమ పరమేశ్వరన్). అయితే తన తల్లిని కాపాడిన తేజ్ ను నందిని ఎలా కలుసుకుంది...వీరిద్దరి ప్రేమ ఎలా ట్రాక్ లో పడింది అన్నదే సినిమా. అయితే ఈ లవ్ స్టోరీ కాస్తా అనేక ప్రేమ కథల సమాహారంగా ఉండటంతో మరోసారి ఈ కుర్ర హీరోకు మరోసారి నిరాశే మిగిలిందని చెప్పొచ్చు. సినిమా ఫస్టాఫ్ ఒకింత కూల్ గా సాగిపోతుంది. సెకండాఫ్ ఒకింత భారంగా కదులుతుంది.

ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కంటే అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ ఎంతో మెరుగ్గా, డామినేటింగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సాయిధరమ్ కూడా మిగిలిన సినిమాలతో పోలిస్తే ఇందులో లవర్ బాయ్ గా ఆకట్టుకున్నా...అనుపమ ముందు నిలబడలేకపోయాడు. సినిమాలో పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఆండ్రూ ఫిక్చరైజేషన్ ఆకట్టుకుంటుంది. క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మాణ సంస్థ కావటంతో సినిమా అంతా రిచ్ లుక్ తోనే సాగుతుంది. ఓవరాల్ గా చూస్తే ‘తేజ్ ఐ లవ్ యూ’ అంతగా పండలేదనే చెప్పొచ్చు.

రేటింగ్. 2.25/5

Next Story
Share it