Telugu Gateway
Cinema

శ్రీనివాస కళ్యాణం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

శ్రీనివాస కళ్యాణం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
X

నితిన్, రాశీ ఖన్నా జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది. దిల్ రాజు నిర్మాతగా... ‘శతమానం భవతి’ ఫేమ్‌ సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి విడుదలైన తొలి పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

పూర్తి స్థాయి మెలోడీతో...సాహిత్యంతో కూడిన ఈ పాట వినసొంపుగా ఉంది. ‘కళ్యాణం.. వైభోగం.. ఆనంద రాగాల శుభయోగం’ అనే పల్లవితో మొదలై.. రుక్మిణీ కల్యాణం, సీతా స్వయంవరం, శ్రీనివాస కల్యాణ ఘట్టాలను ఉటంకిస్తూ వివాహ ప్రాశస్త్యాన్ని వివరించే ఈ పాట సంగీత ప్రియుల మనసు దోచుకుంటోంది. మిక్కీ జే మేయర్‌ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్‌ అందించగా ఎస్పీ బాలు తన స్వరంతో పాటకు జీవం పోశారు.

https://www.youtube.com/watch?v=DYcBV9OoAag

Next Story
Share it