Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘శైలజారెడ్డి అల్లుడు’ రాక ఆగస్టు 31న

0

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణది టాలీవుడ్ లో హిట్ పెయిర్. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య హీరోగా..రమ్యకృష్ణ అత్తగారుగా నటించిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ సినిమా ఆగస్టు 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని నాగచైతన్య ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా తొలిసారి అను ఇమాన్యుయల్ నటిస్తోంది.

- Advertisement -

గత కొంత కాలంగా హిట్ బాటలో పయనిస్తున్న మారుతినే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. శైలజారెడ్డి అల్లుడు సినిమాకు గోపీసుందర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.